సీనియర్ తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు, కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్న వార్త తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈటలపై ఆరోపణలు వచ్చినా కూడా చేర్చుకోవడానికి బీజేపీ ఎందుకు ఆసక్తి చూపుతోంది? అలాగే కమ్యూనిస్టు భావాలున్న ఈటల తన సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధమైన కమలం పార్టీలో ఎలా చేరుతున్నాడన్నది అర్థం కాని ప్రశ్న. మొత్తంగా ఇప్పుడు అటు ఈటల, ఇటు బీజేపీ తెలంగాణలో బలపడడం కోసమే ఈ కలయికకు దారితీస్తున్నారా? అన్న ప్రశ్నలు తెలంగాణ రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
ఆదివారం సాయంత్రం న్యూ ఢిల్లీకి బయలుదేరిన ఈటల రాజేందర్ సోమవారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో కలువనున్నారు. ఈ మీటింగ్ లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సహా బీజేపీ నేతలు ఉండనున్నారు. అయితే ఈటల ఈరోజే బీజేపీలో చేరుతాడన్న గ్యారెంటీ మాత్రం రావడం లేదట.. అతను వెంటనే నడ్డా సమక్షంలో బిజెపిలో చేరవచ్చు లేదా టిఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాత అధికారికంగా చేరవచ్చని.. అప్పటిదాకా సమయం కోరుతారని అంటున్నారు. ఈటలతోపాటు మరో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా బీజేపీలో చేరనున్నారు.
బీజేపీలో చేరడానికి ముందే ఈటల రాజేందర్ ప్రతి ఒక్కరినీ కలిశాడు. వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ మరియు తెలంగాణ జన సమితి నేతలను సహా కేసీఆర్ చేతుల్లో అణచివేతకు గురై ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారి మద్దతు కోరారు. కేసీఆర్ ను ఎదురించడమే ధ్యేయమని ఈటల నాడు ప్రకటించారు. కేసీఆర్ వ్యతిరేకులైన ప్రతి వ్యక్తి నుండి తాను మద్దతు కోరుతున్నానని, స్వతంత్రంగా హుజురాబాద్‌కు ఉప ఎన్నికలలో పోటీ చేస్తానని కూడా ఈటల మీడియాతో అన్నారు. తాను కలిసిన వివిధ పార్టీల నాయకులకు ఇదే విషయాన్ని ఈటల చెబుతున్నారు.
ప్రతీ రాజకీయ పార్టీ రాజేందర్ పట్ల సానుభూతి వ్యక్తం చేసింది, స్వతంత్రంగా ఆయనకు మద్దతు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీని పెట్టాలని.. ఆయనకు అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తుందని ఈటలకు సూచించారు.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ఈటలను ఆహ్వానించినట్టు సమాచారం. పార్టీలో చేరితే తనకు కాంగ్రెస్ నుంచి పూర్తి హృదయపూర్వక మద్దతు లభిస్తుందని, అయితే ఆయన స్వతంత్రంగా పోటీ చేస్తే, కాంగ్రెస్ కూడా తన అభ్యర్థిని నిలబెట్టవలసి వస్తుందని ప్రకటించారు.
ఈటల రాజేందర్‌కు బీజేపీ నాయకుల నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. అయితే, కేసీఆర్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసుల్లో అరెస్టు చేయకుండా కేంద్రం తనకు రక్షణ కల్పిస్తుందని బీజేపీ నాయకులు అదనపు హామీ ఇచ్చినట్టుగా రాజకీయవర్గాల్లో ప్రచారం ఉంది. అవసరమైతే, పార్టీ అధికారంలోకి వస్తే పెద్దపీట వేస్తామని ప్రతిపాదన చేసినట్లుగా తెలిసింది.
కాబట్టి స్వతంత్రంగా పోరాడడంలో అర్థం లేదని ఈట రాజేందర్ భావించినట్టు సమాచారం. ఎందుకంటే ఒంటరిగా పోటీచేస్తే ఎవరూ ఈటలకు మద్దతు ఇవ్వరు. చివరికి అది టిఆర్ఎస్ కు ప్రయోజనం చేకూరుస్తుంది. అన్ని సాధకబాధకాలను అంచనా వేసిన తరువాత బీజేపీ ఆఫర్ మంచిదని ఈటల గ్రహించినట్టు సమాచారం. అందుకే ఈటల బీజేపీని ఎంచుకున్నారని వర్గాలు తెలిపాయి.