ఏపీలో అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందని కోస్తాంధ్రవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాలనా రాజధాని నుంచి శాసన రాజధానిగా మాత్రమే అమరావతి పరిమితం కావడంపై పెదవి విరుస్తున్నారు. ఇక, వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడంతో ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో న్యాయ రాజధాని మాత్రమే ఏర్పాటు అవుతోంది. అయితే, శాసన, పాలనా రాజధానులు తరలిపోతున్నప్పటికీ రాయలసీమ వాసుల్లో, ఆ ప్రాంత నేతల్లో పెద్దగా అసంతృప్తి ఉన్నట్లు కనబడడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికార పార్టీ నేతలను వదిలేసినా...విపక్ష పార్టీ టీడీపీ నేతలూ తమ ప్రాంతానికి మరోసారి మొండిచేయి చూపుతున్నా కిక్కురుమనడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాయలసీమలోకేఈ, కోట్ల కుటుంబం, భూమా అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు, నిమ్మల కిష్టప్ప, పల్లె రఘునాధరెెడ్డి వంటి నేతలు టీడీపీకి ఉన్నారు. చంద్రబాబు హయాంలో ఏపీ హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేసేటప్పుడే కేఈ కృష్ణమూర్తి వంటి నేతలు కర్నూలు లో పెట్టాలని సూచించారు. కానీ చంద్రబాబు వినలేదు. అందుకే, ఇపుడు కేఈ సహా మిగతా నేతలు కర్నూలును న్యాయరాజధానిగా అంగీకరించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వెళ్లడం సరికాదని టీడీపీ నేతలు భావిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక, రాయలసీమ ప్రాంత వాసుల్లోనూ ఏపీ రాజధాని కోస్తా, ఉత్తరాంధ్ర...ఇలా ఎక్కడున్నా పర్లేదు అన్న అభిప్రాయం ఉన్నట్లు కనిపిస్తోంది.
ఉమ్మడి ఏపీలోను, అవశేషాంధ్రప్రదేశ్ లోనూ సీమ వాసులకు ఏపీలోని విశాఖ, గుంటూరు, విజయవాడ నగరాలతో పెద్దగా పనిలేదు. ఎందుకంటే, చాలా ఏళ్ల నుంచి రాయలసీమ వాసులు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాలలో సెటిల్ అయిపోయారు. చిత్తూరు వాళ్లు చెన్నై, బెంగుళూరుతో, అనంతపురం వాళ్లు బెంగుళూరు, హైదరాబాదుతో, కడప వాళ్లు చెన్నై, బెంగుళూరు హైదరాబాదుతో, కర్నూలు వారు హైదరాబాదుతో ఉద్యోగ, వ్యాపార లావాదేవీలు నెరుపుతున్నారు. వారందరికీ ఆయా ప్రాంతాల్లో ఆస్తి పాస్తులు,నివాస స్థలాలు దాదాపుగా ఉన్నాయి. ఆయా నగరాల్లో నివసిస్తోన్న సీమవాసులు దాదాపుగా అక్కడే సెటిల్ అయిపోయారని చెప్పవచ్చు. కాబట్టి, వారికి విశాఖ, అమరావతిపై పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చు.
అదీగాక, రాయలసీమ ప్రాంతవాసులకు ఇటు అమరావతి..అటు విశాఖ...రెండు ప్రాంతాలు చాలా దూరం. అందుకే నవ్యాంధ్రప్రదేశ్ లోనూ రాయలసీమవాసులు....ఇటు గత రాజధాని అమరావతిని గాని, ప్రస్తుత పాలనా రాజధాని విశాఖను గాని పెద్దగా పట్టించుకోవడం లేదు. తమ ప్రాంతాలకు సుదూరంగా ఉన్న విశాఖ, అమరావతిల కంటే అందుబాటులో ఉన్న మహానగరాలతో తమకు మంచి సంబంధాలున్నాయన్న భావనలో సీమవాసులున్నారని చెప్పవచ్చు. ఇంకా గట్టిగా మాట్లాడితే....ఆ రెండు ప్రాంతాలు ఈ మహానగరాల రేంజ్ కు డెవలప్ అయినపుడు చూద్దాంలే అన్న ఫీలింగ్ సీమవాసులకుందని చెప్పవచ్చు. అందుకే, కాబోలు రాజధాని అమరావతి, విశాఖల విషయంలో సీమ వాసులకు ఆవేదన లేదని, సీమ పౌరుషం...పెద్దగా కనబడడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.