ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజా ఢిల్లీ పర్యటనలో అనుకోని అనుభవాలు ఎదురైనట్లుగా చెబుతున్నారు. ఆయనేమాత్రం ఊహించని కొన్ని పరిణామాలు ఆయనకు చికాకును తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ అంశాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బస చేసిన ప్రాంతంలో కరెంటు పోతే.. దాన్ని పునరుద్ధరించేందుకు తీసుకున్న సమయం హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా తన ఢిల్లీ పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఏపీ భవన్ లోని జన్ పథ్ లో బస చేశారు. మంగళవారం రాత్రి దానికి పవర్ ఇచ్చే ట్రాన్స్ ఫార్మార్ పేలిపోయింది. ఇలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు.. కొత్త ట్రాన్స్ ఫార్మర్ ను హుటాహుటిన ఏర్పాటు చేస్తారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వెంటనే మార్చలేదు. ట్రాన్సఫార్మర్ మార్చటానికి చాలానే సమయాన్ని తీసుకున్నట్లుగా సమాచారం.
రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత అమిత్ షాతో భేటీ అయిన తర్వాత జగన్ అతిధి గృహానికి చేరుకున్నారు. అప్పటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోవటాన్ని ఏపీ అధికారులు సీరియస్ గా తీసుకుంటున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బస చేసిన చోట.. ఏదైనా అనుకోని అవాంతరం ఎదురైతే.. స్పందించాల్సిన యంత్రాంగం సరైన సమయానికి స్పందించకపోవటం ఏమిటి? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.