జగన్. ఒకప్పుడు ఎంపీ. తండ్రి చాటు తనయుడు. అతి పెద్ద జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో సభ్యుడు. అయితే ఆ తరువాత చూస్తే జగన్ ఒక ప్రబల రాజకీయ శక్తిగా మారారు. తనకు టికెట్ ఇచ్చిన మేరు శిఖరమైన కాంగ్రెస్ నే కేవలం రెండేళ్ల వ్యవధిలో చాలెంజి చేసి మరీ బయటకు వచ్చి అయిదు లక్షల మెజారిటీతో ఓడించారు. ఆ తరువాత జగన్ సైన్యం ఏర్పడింది. అదే వైసీపీగా మారింది.
ఇక 2014 నాటికి జగన్ తృటిలో అధికారం పోగొట్టుకుని విపక్ష నేతగా బలంగా ముందుకు సాగారు. 2019 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచారు. ఇపుడు జగన్ తో అతి పెద్ద కుటుంబం ఉంది. అయినా సరే రెండున్నరేళ్ల పాలనలో చూస్తే జగన్ ఈ రోజుకీ ఒంటరిగానే ఉంటున్నారా అనిపిస్తోంది. ఆయన నాయకత్వాన ప్రభుత్వ నిర్ణయాలు వరసబెట్టి కోర్టుల్లో కొట్టివేతకు గురి అవుతున్నాయి.
ఒకనాడు జగన్ ఒంటరి, కానీ ఇపుడు అతి పెద్ద ప్రభుత్వ వ్యవస్థకు అధిపతి. మరి జగన్ కే ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది అన్నదే చర్చగా ఉంది. వరసబెట్టి ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. అలాగే ప్రతీ నిర్ణయం అమలుకు నోచుకోకుండా ఎక్కడో చిక్కుకుని ఆగిపోతోంది.
మరి ఈ విధంగా జరగడం అంటే లోపం ఎక్కడో ఉన్నట్లే కదా. మరి దాన్ని గ్రహించడం లేదా అని జగన్ గురించి ఆలోచిస్తున్న వారు అనుకుంటున్నారు. ఏపీలో ఇండస్ట్రియల్ పాలసీ మీద ఈ రోజుకీ సరైన తీరున ఎందుకు చర్చించరు అన్న మాట ఉంది. సగం పాలన పూర్తి అయినా ఏపీలో ఇండస్ట్రీ పాలసీ ఏంటి అన్నది పెద్దగా ఎవరికీ అవగాహన లేకుండా పోయింది అన్న వారూ ఉన్నారు.
ఇక పంచాయతీ వ్యవస్థ మీద, వాలంటీర్ల వ్యవస్థ మీద కూడా అస్పష్టత, అయోమయం, గందరగోళం అలాగే కొనసాగుతున్నాయి. వైసీపీ సర్కార్ తెచ్చిన సచివాలయ వ్యవస్థ అన్నింటికీ సమాంతరంగా ఉందని కూడా ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీ సర్పంచులే తమ కంటే వాలంటీర్లే నయం అంటున్నారు అంటే ఆలోచించాలి కదా.
ఇక జగన్ అధికారంలోకి వచ్చాక అతి పెద్ద సమస్యగా మారింది ఏదైనా ఉంది అంటే అది ఇసుక పాలసీయే అంటారు. ఇసుక అంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అనేక ఇబ్బందులు పెట్టింది. దాన్ని మార్చి మంచి పాలసీని తెస్తామని జగన్ ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికి అనేక సార్లు మార్పు చేశారు. కానీ ఆ పాలసీ ఏంటో దేవుడికి కూడా అర్ధం కావడంలేదు అంటున్నారు.
అలాగే మద్యం పాలసీ కూడా ఉంది. సంపూర్ణ మధ్య పాన నిషేధం అని జగన్ పాదయాత్ర వేళ చెప్పారు. అది దశలవారీగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఆ విధంగా తాము వచ్చాక ప్రతీ ఏటా ఇరవై శాతం వంతున మధ్యం దుకాణాలను రద్దు చేసుకుంటూ పోయి అయిదేళ్లకు అసలు లేకుండా చూస్తామని చెప్పారు. కానీ జరుగుతున్నది విరుద్ధంగా ఉంది.
ఇపుడు చూస్తే మద్యం ధరలను బాగా తగ్గించేశారు. అంటే మద్యం ప్రియులను ఆకట్టుకోవడానికి, వ్యసనపరులకు మళ్ళీ ఆహ్వాహం ఘనంగా పలకడానికేనా ఈ నిర్ణయం అన్న విమర్శలు ఉన్నాయి. అసలు ప్రభుత్వంగా, పార్టీగా వైసీపీకి ఈ విషయంలో ఉన్న పాలసీ ఏంటి అన్నది కూడా ఎవరికీ అర్ధం కాని పరిస్థితిగా ఉంది మరి.
ఇక పోతే లేటెస్ట్ గా సినిమా టికెట్ల వ్యవహారం. అసలెందుకు దీన్ని కెలుక్కున్నారో అర్ధం కాని విషయం. దీని వల్ల ప్రభుత్వానికి వచ్చేది పెద్దగా ఏముంది అన్న చర్చ కూడా ఉంది. అయితే ఇగోస్ తోనే దీని మీదకు వచ్చారు అన్న విమర్శలు ఉన్నాయి. అయితే దీని మీద జారీ చేసిన జీవో 35ను కోర్టు రద్దు చేయడంతో ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుందా అన్న చర్చ కూడా వస్తోంది. మరి న్యాయ సమీక్షకు నిలబడని ఈ నిర్ణయం వల్ల అభాసుపాలు కావడం, బలమైన వ్యవస్థగా ఉన్న సినీ రంగంతో కయ్యం పెట్టుకోవడానికి తప్ప మరి దేనికీ అన్న మాటా ఉందిపుడు.
ఇక ఈ మధ్యన మరో మాట కూడా ప్రభుత్వ వర్గాల నుంచి వినిపించింది. తామే మటన్ షాపులు ఏపీ అంతా తెరచి బిజినెస్ చేస్తామని, దాని మీద టీడీపీ సహా అన్ని పార్టీలు తప్పుపట్టాయి. సర్కార్ కి ఆదాయం లేకపోతే పోవచ్చు గాక ఇలాంటివి ఏంటి అన్న మాట కూడా వచ్చింది. మరి ఇవన్నీ ఆలోచింది సమగ్రంగా తీసుకుంటున్న నిర్ణయాలేనా అన్న చర్చ కూడా ఉంది.
ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ముందు అధికారులతోనూ, నిపుణులతోనూ చర్చించినట్లు అయితే అవి వివాదం కావు, కోర్టులలో కూడా అవి కొట్టివేయబడవు, కానీ జగన్ సర్కార్ మాత్రం ఎందుకో ఆత్రంగా నిర్ణయాలు తీసుకుంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదే టైమ్ లో అవి అమలు కాకుండా పోతున్నాయి. మరి ప్రభుత్వం అన్నాక ఒక పాలసీ పెట్టుకుని ముందుకు సాగుతుంది, బలమైన వ్యవస్థగా ఉంటుంది అని అంతా అనుకుంటారు, కానీ జగన్ సర్కార్ తీరు చూస్తే మాత్రం అలాంటి భావం ఎందుకో కలగడం లేదు అంటే కచ్చితంగా లోటుపాట్లు ఎక్కడో ఉన్నాయని అంటున్నారు. మరి ఇంత జరుగుతున్నా వాస్తవాలను జగన్ ఎందుకు తెలుసుకోవడం లేదు అన్నదే నిలువెత్తు ప్రశ్న. దీనికి జవాబు ఉందా.