మోడీకి క్రేజ్ పడిపోయిందా? ఆయన వస్తువులు ఎందుకు కొనడం లేదు?

Update: 2021-10-08 04:50 GMT
దేశంలోనే కాకుండా ప్రపంచంలో నరేంద్రమోదీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. చాలా దేశాల్లో పర్యటించిన ఆయన విదేశీ ప్రతినిధులతో సత్సంబంధాలు నెలకొల్పారు. ఇక దేశంలో తెల్లారి లేచిన తరువాత మోదీ మోహం చూస్తామనేవారు ఎందరో ఉన్నారు. మిగతా దేవుళ్లకంటే మోదీయే మాకు దేవుడు అనేవాళ్లున్నారు. అంతకుముందు గుజరాత్లో ఆ తరువాత దేశంలో యమ క్రేజ్ సంపాదించుకున్న మోదీ గ్రాఫ్ రాను రాను తగ్గిపోతుందని ఇటీవల నిర్వహించిన కొన్ని సర్వేలు తెలిపాయి. అయితే ఆ సర్వేలను బీజేపీ నాయకులు కొట్టిపారేశారు. అయితే మోదీ క్రేజ్ తగ్గిందనడానికి తాజాగా జరిగిన ఘటనే ఉదాహరణగా చెప్పుకుంటున్నారు.

మోదీకున్న క్రేజ్ తో పాటు ఆయన వస్తువులకు కూడా విపరీతమైన డిమాండ్ ఉండేది. ఆయనకు సంబంధించిన వస్తువులను దక్కించుకోవడానికి కొందరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవారు. అంతేకాకుండా అలాంటి కోట్లు పెట్టినా మోడీ వస్తువులు దొరికేవి కావు. కానీ ఇప్పుడు ఆయనకు సంబంధించిన కొన్ని వస్తువులకు ఒక్క బిడ్ కూడా వేయలేదు. మోదీ వస్తువులను దక్కించుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు.

తాజాగా మోదీకి చెందిన వస్తువులను వేలం వేశారు. ఆయనకు విదేశాల్లో వచ్చిన సాలువాలు, బాక్సర్లు ఇచ్చిన గ్లౌజులు, మోదీ తన తల్లితో కలిసి దిగిన ఫొటోలతో పాటు మరికొన్నింటికి వేలం వేశారు. అయితే ఇందులో మోదీ సాలువలలు, గ్లౌజులకు ఒక్కరూ కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. మిగతా వాటికీ పెద్దగా వేలం జరగలేదు. గతంలో కన్నా మోదీకి చెందిన వస్తువులు తక్కువ ధరకే వేలం పాడారు. దీంతో మోదీ వస్తువులను ఎవరూ పట్టించుకోవడం లేదని అర్థమవుతోంది.

ఆయన వస్తువులను వేలం వేసి దాని ద్వారా వచ్చిన సొమ్ముతో గంగానది ప్రక్షాళనకు ఉపయోగిస్తామని మోదీ ప్రకటించారు. అయినా మోదీని ఎవరూ నమ్మడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. అందుకే ఆయన వస్తువులను ఎవరూ కొనుగోలు చేయడం లేదని అంటున్నారు. గతంలోకంటే ఇప్పుడు ఆయన వస్తువులకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోయిందిన అంటున్నారు. అయితే రాను రాను మరింత తగ్గిపోనుందా..? అని కొందరు చర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉండగా మోదీ వస్తువుల కంటే క్రీడాకారుల ఆట వస్తువులకు వేలం ఎక్కువ ధర పలుకుతున్నాయి. ఇటీవల ఒలంపిక్స్ లో భారత్ కు స్వర్ణం తెచ్చిపెట్టిన నీరజ్ చెప్రా వాడిన ఈట ధర 1.5 కోట్లు పలకింది. అలాగే పీవీ సింధు వాడిన రాకెట్ కు రూ.80 లక్షలు పలికారు. అంతే క్రీడాకారుల వస్తువుల కంటే మోదీ వస్తువులకు వేలం తక్కువగా పలికిందని అంటున్నారు. మోదీకి ఇతరులు ఇచ్చిన వస్తువులకంటే ఆయన తల్లితో దిగిన ఫొటోకు కూడా బిడ్ వేయకపోవడం గమనార్హం.

అయితే కొందరు మిగతా దేవుళ్ల కంటే మాకు మోదీనే దేవుడని ఇంట్లో ఫొటో పెట్టుకున్నారు. అలాగే తెల్లారి లేచి మోదీ మోహమే చూస్తామని కొందరు వాదిస్తున్నారు. అలాంటి వారు ఈ విషయాన్ని గమనించాలని ప్రతిపక్షాల నాయకులు అంటున్నారు. కరోనా కాలం నుంచి మోదీ గ్రాఫ్ విపరీతంగా పడిపోయిందని, ఆయనపై నమ్మకం పెట్టుకునే వారి సంఖ్య తగ్గిపోతుందని ఇటీవల కొన్ని సర్వేలు బయటపెట్టాయి. కానీ బీజేపీ నాయకులు అదంతా ఫేక్ సర్వే అని కొట్టి పారేస్తున్నారు. కానీ తాజాగ మోదీ వస్తువుల వేలం విషయాన్ని పరిశీలిస్తే ఆయనకున్న క్రేజ్ తగ్గిందని నిరూపితమైందని అంటున్నారు. దాదాపు ఏడేళ్ల పాటు మోదీ అంటే ఎక్కువ మక్కువ పెట్టుకునే వారు ఇప్పుడు తగ్గుతున్నారని అంటున్నారు. అయితే ఈ పరిస్థితి ఎన్నికల వరు ఎలా ఉంటుందోనని కొందరు చర్చలు పెడుతున్నారు.





Tags:    

Similar News