సర్ ప్రైజ్ అంటూ కళ్లు మూసుకోమన్న కాబోయే భార్య.. ఏం జరిగిందో తెలిస్తే షాకే
మనిషి మనిషిని నమ్మలేని దారుణమైన రోజులు వచ్చేశాయి? ఇంతకాలం పెద్దగా పరిచయం లేని వారితో స్నేహపూర్వకంగా ఉండాలంటే ఆలోచించే పాడు రోజులు వచ్చాయనుకునే వాళ్లు. ఇప్పుడు అందుకు భిన్నంగా జీవిత భాగస్వాములు చేస్తున్న చేష్టల్ని చూస్తే నోట మాట రాని పరిస్థితి. ఇప్పటివరకు ఏ క్రైం సీరియల్ లోనూ.. సినిమాలోనూ కనిపించని సీన్ ఒకటి ఏపీలోని అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఉదంతం గురించి తెలిసిన తర్వాత ఎవరైనా సర్ ప్రైజ్ అంటే చాలు.. ఒక్కసారిగా హడలిపోయే పరిస్థితి.
ఎంగేజ్ మెంట్ అయి.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వేళ.. కాబోయే భార్య సర్ ప్రైజ్ అంటూ కళ్లు మూసుకోవాలని కోరటం.. ముద్దు ముద్దుగా అడిగిన ఆవిడ ముచ్చట తీర్చేందుకు సిద్ధమైన అతగాడు ఇప్పుడు చావు బతుకుల మధ్య పోరాటం చేసే పరిస్థితి. సర్ ప్రైజ్ అన్న తర్వాత ఏం జరిగిందన్న విషయంలోకి వెళితే.. అనకాపల్లి జిల్లాలోని ఘాట్ రోడ్డుకు చెందిన రామునాయుడికి పుష్ప అనే అమ్మాయికి ఎంగేజ్ మెంట్ జరిగింది. వీరి వివాహం మే 20న జరగాల్సి ఉంది. పెళ్లికి కావాల్సిన షాపింగ్ లో భాగంగా ఇద్దరూ వడ్డాది పట్టణానికి వెళ్లారు.
షాపింగ్ చేసి తిరుగు ప్రయాణమయ్యారు. ఇక్కడి వరకు సీన్ అంతా బాగానే ఉంది. రిటర్న్ జర్నీలో కొమళ్లపూడి శివారులోని బాబా ఆశ్రమం వద్దకు చేరుకున్న వేళ.. కాబోయే భార్య సర్ ప్రైజ్ అంటూ ఊరించింది.
సరదాగా గడుపుదామా? అంటే ఓకే అనేశాడు కాబోయే పెళ్లి కొడుకు. కాబోయే భార్య చెప్పినట్లే కళ్లకు గంతలు కట్టుకున్నాడు. కాసేపు గడిచిన తర్వాత తనతో తెచ్చుకున్న కత్తితో రాము నాయుడు గొంతు కోసింది పుష్ప. తీవ్రమైన నొప్పితో విలవిలలాడుతున్న వేళ.. ఏదో తగిలిందని చెప్పి.. తానే అతడ్ని టూవీలర్ మీద దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లింది.
సరదాగా ఆడుకుంటుంటే గొంతుకు ఏదో తగిలిందని పుష్ప చెప్పటం.. ఆ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో.. అతడ్ని అనకాపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ మొత్తానికి కారణమైన యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సర్ ప్రైజ్ అంటూ కాబోయే భార్య చేసిన చేష్ట అబ్బాయి తరఫు వారికి ఒక పట్టాన మింగుడుపడని పరిస్థితి.
ఇంతకీ ఇదంతా ఎందుకు చేసినట్లు? అన్న ప్రశ్నకు సమాధానం తెలిస్తే మరింత షాక్ కు గురి కావటం ఖాయం. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్న కోపంతో కాబోయే భర్తను అలా చేసినట్లుగా చెబుతున్నారు. ఇదంతా చదివాక.. ఎవరైనా సర్ ప్రైజ్ అన్న అంటే ఉలిక్కిపడటం ఖాయం. కాదంటారా?