జ‌గ‌న్ అలా చేస్తే.. గంటాకు తిప్ప‌లేనా..!

Update: 2019-07-14 14:30 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్ వేస్తున్న అడుగులు గ‌త ప్ర‌భుత్వ పెద్ద‌ల్లో తీవ్ర అల‌జ‌డి రేపుతున్నాయి. వారి గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తున్నాయి. తన‌ ప్ర‌భుత్వంలో ఎలా అక్ర‌మాలు జ‌ర‌గ‌రాద‌ని - పాల‌న పార‌ద‌ర్శ‌కంగా ఉండాల‌ని - ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం నుంచి అందే సేవ‌ల‌ను ఉచితంగా పొందేలా స‌క్ర‌మంగా వ్య‌వ‌హ‌రించాల‌ని - ప్ర‌తి ప‌నికీ జ‌వాబుదారీ వ్య‌వ‌స్థ ఉండాల‌ని జ‌గ‌న్ కోరుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్ర‌భుత్వ శాఖ‌ల‌ను ప్ర‌క్షాళ‌న దిశ‌గా తీసుకు వెళ్లి - వ‌చ్చే ఆరు మాసాల్లోనే రాష్ట్రంలో మంచి పాల‌న అందుతోంద‌నేలా పేరు తెచ్చుకోవాని ఆయ‌న ప‌క్కా ప్ర‌ణాళిక నిర్ణ‌యించుకున్నారు.

గంటా చుట్టూ.. తీవ్ర ఆరోప‌ణ‌లు!

ఈ క్ర‌మంలోనే త‌న ప్ర‌భుత్వంలో అక్ర‌మాలు జ‌ర‌గ‌కుండా చూసుకోవ‌డంతోపాటు - గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన అక్ర‌మాల‌పై కొర‌డా ఝుళిపించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే విశాఖ‌ప‌ట్నంలో గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన భూ కుంభ కోణం విచార‌ణ‌ను వేగ‌వంతం చేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు తాజాగా స‌మాచారం అందుతోంది. నిజానికి ఈ భూకుంభ‌కోణంపై టీడీపీ నేత‌ల్లోనే అప్ప‌ట్లో విభేదాలు చోటు చేసుకున్నారు.అప్ప‌టి మంత్రి గంటా శ్రీనివాస‌రావు భారీ ఎత్తున అవినీతికి పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. భూక‌బ్జా కేసుల్లో ప‌లువురు నేత‌లు ఉన్నా.. గంటా పేరు మాత్రం ప్ర‌ముఖంగా వినిపించింది.

సిట్‌.. నివేదిక‌పై ద‌ర్యాప్తు?!

దీంతో అప్ప‌టి బాబు ప్ర‌భుత్వం దీనిపై ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని(సిట్) నియ‌మించింది. ఈ బృందం ప‌లు కోణాల్లో విచార‌ణ చేసి.. నివేదిక‌ను ప్ర‌భుత్వానికి అందించింది. అయితే, ఎన్నిక‌లు రావ‌డంతో ఈ విష‌యం తెర‌మ‌రుగైంది. ఇక‌, ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి రావడంతో విశాఖ‌లోని స్థానిక నాయ‌కులు.. ఈ కేసు విష‌యాన్ని తేల్చాల‌ని వైసీపీ ఎమ్మెల్యేల‌పై ఒత్తిడి తెస్తున్నారు. ఈ కేసులో అన్ని వ్య‌వ‌హారాల‌ను మ‌రింత లోతుగా ప‌రిశీలిచించి భూ క‌బ్జాకు పాల్ప‌డిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు కోరుతున్నారు. దీంతో ప్ర‌బుత్వానికి ఈ విష‌యంపై ప్ర‌తిపాద‌న‌లు చేరుతున్న‌ట్టు తెలుస్తోంది.

గంటా.. ఫుల్ సైలెంట్‌!

ఇక‌, మాజీ మంత్రి గంటా విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న తాజా ఎన్నిక‌ల్లో విశాఖ ఉత్త‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. దీనికి ముందు ఆయ‌న జ‌గ‌న్ పైనా - వైసీపీ పైనా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించేవారు. అయితే, జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం, విశాఖ నేత‌లు .. అక్క‌డి భూ క‌బ్జా కేసుల‌పై ఒత్తిడి పెంచుతుండ‌డంతో ప్ర‌భుత్వం త‌న‌ను ఖ‌చ్చితంగా టార్గెట్ చేస్తుంద‌ని భావిస్తున్న గంటా పూర్తి మౌనం పాటిస్తున్నారు. ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం కూడా లేదు. ఒక‌ప‌క్క - బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మైన నేప‌థ్యంలో కూడా ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌క పోవ‌డం, మీడియాకు అందుబాటులో లేకుండా పోవ‌డాన్ని బ‌ట్టి విశాఖ భూక‌బ్జా కేసుతో భారీగా భ‌య‌ప‌డుతున్నార‌ని స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


Tags:    

Similar News