ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో అఖండ విజయంతో జగన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక్క అవకాశం అంటూ జగన్ చేసిన విన్నపానికి స్పందించిన ప్రజలు ఆయనకు అనూహ్య విజయాన్ని కట్టబెట్టారు. ఆయన అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచిపోయింది.
కానీ మారిన పరిస్థితుల కారణంగా వైసీపీ ప్రభుత్వంపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోందన్న టాక్ ఉంది. ప్రభుత్వంలో పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు పార్టీల్లోనూ వివిధ పదవుల్లో ఉన్న నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పార్టీని నమ్ముకుని ఉన్నదంతా ఊడ్చిపెట్టామని పార్టీల్లో పదవుల్లో ఉన్న నాయకులు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.
వాళ్లకు పదవులు..
2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికే పరిమితమైన జగన్.. అప్పుడు పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీని డెవలప్ చేసేందుకు ఎంతో మందికి పార్టీ పదవులు ఇచ్చి వాళ్లకు జగన్ బాధ్యతలు అప్పజెప్పారు. పార్టీ అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యతనిస్తామని వాళ్లకు చెప్పి జగన్ పార్టీ బాధ్యతలు కట్టబెట్టారు. ప్రభుత్వం వచ్చాక తమను నెత్తిమీద పెట్టుకుంటారని ఆ నాయకులు భావించారు. పదవుల కోసం ఎగబాకి భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టారు. సొంత ఆస్తులమ్మి మరీ పార్టీ కోసం కష్టపడ్డారు. కానీ తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టైమంతా అందుకే..
జగన్ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలపైనే పూర్తి దృష్టి సారించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కుదేలవుతున్నా ఆయన మాత్రం నవరత్నాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచుతూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ పథకాలే పార్టీని మళ్లీ గెలిపిస్తారనే నమ్మకంతో జగన్ ఉన్నారు. కానీ పార్టీని మాత్రం ఆయన పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూడేళ్లవుతున్నా పార్టీ పదవుల గురించి ఆయన పట్టించుకోలేదు. కార్యవర్గం గురించి ఎలాంటి ఆలోచన చేయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లు ఇప్పుడు తమకు శూన్యమే మిగిలిందని బాధపడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర తమ గోడు వెలబోసుకుంటున్నారు. ఇప్పటికైనా జగన్ తమ మీద దయ తలచాలని కోరుకుంటున్నారు.