త్వరలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దేశం యావత్తు ఈ బడ్జెట్ కోసం ఎదురుచూస్తోంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉంటాయి.. ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి..? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా ఈసారి కూడా బడ్జెట్ ను పేపర్ లెస్ ద్వారా ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. ఇదిలా ఉండగా కరోనా రాకతో దాదాపు అన్ని సంస్థలు వర్క్ ఫ్రం హోం ను ప్రవేశపెట్టాయి. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో వర్క్ ఫ్రం హోం విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వర్క్ ఫ్రం హోం విదానం ప్రవేశపెట్టిన తరువాత కంపెనీలన్నీ కొంతమేర ఆర్థికంగా నష్టపోయాయి. అయితే వర్క్ ఫ్రంహోం తో కొన్ని ఖర్చులు తగ్గాయి. కానీ ఆ భారం మొత్తం ఉద్యోగులపై పడింది. అయితే కొన్ని కంపెనీలు ఆ ఖర్చులను భరించినా.. మరికొన్ని మాత్రం ఉద్యోగలుపై భారం మోపాయి. ఇవే కాకుండా వర్క్ ఫ్రం హోంలో ఉద్యోగుల పనిగంటలు ఎక్కువ కావడంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొందరు పేర్కొన్నారు. ఈ ఇబ్బందులను తొలగించేలా బడ్జెట్లో ప్రణాళిక రచించినట్లు భావిస్తున్నారు.
ఇక ఈ విధానం ద్వారా ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం ద్వారా కరెంట్ బిల్లు మొదలు టీ, స్నాక్స్ వంటి ఆఫీసులు కల్పించే అనేక సౌకర్యాలను ఉద్యోగులు సమకూర్చుకుంటున్నారు. ఇందులో కోసం తమ జీతం నుంచి వెచ్చిస్తున్నారు. వర్క్ ఫ్రం హోం వల్ల ఉద్యోగులకు పెరిగిన ఆర్థిక భారాన్ని పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అదనపు డిడక్షన్ ను ఉద్యోగులు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత స్టాండర్డ్ డిడక్షన్లో వర్క్ ఫ్రం హోం అలవెన్స్ ను కవర్ చేసేందుకు ఎలాంటి అవకాశం లేదు. దీంతో ఇంటి నుంచి పనిచేసేవారికి డిడక్షన్ పరిమితి పెంచాలని లేదా ఇంటి ఖర్చుల కోసం కొత్త డిడక్షన్ ను ప్రశేవపెట్టాలని కోరుతున్నారు.
ప్రముఖ సంస్థ డెలాయిట్ వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు అలవెన్స్ పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ ప్రతిపాదనను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్లో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ డిమాండ్ ను ఆర్థిక శాఖ మంత్రి అంగీకరించారా..? లేదా..? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ అంగీకరిస్తే మాత్రం వర్క్ ఫ్రం హోం ఉద్యోగుల బాధలు తీరినట్లేనని అంటున్నారు. వర్క్ ఫ్రం హోం వల్ల ఆర్థికంగానే కాకుండా మానసికంగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఆర్థికంగా వెసులుబాటు అయితే ఉద్యోగులు రిలాక్స్ అవుతారని అంటున్నారు.