బురఖా బతుకులకు స్వస్తి

Update: 2018-07-25 06:56 GMT
పొరుగు దేశం పాకిస్థాన్‌ లో ఆంక్షాలకు కాలం తీరిందా? అక్కడి మహిళలకు స్వేచ్ఛా గాలులు వీస్తున్నాయ.? బురఖా  బతుకులకు స్వస్తి పలకనుందా.? అవుననే అనిపిస్తున్నాయి అక్కడి పరిస్థితులు. దశాబ్దాల కాలంగా దోపిడీకి - వివక్షకు తెరచాటు జీవితాలకు చిక్కిన పాక్‌ మహిళా శక్తి తానేమిటో ప్రపంచానికి చూపించనుంది. పాకిస్థాన్‌ లో బుధవారం జరగతున్న సార్వత్రిక ఎన్నికలలో వివిధ పార్టీల నుంచి 171 మంది మహిళలు ఎన్నికల బరిలో నిలిచారు. ఇది ఆ దేశ చరిత్రలో తొలిసారి. ప్రపంచంలో మహిళా శక్తికి శుభపరిణామం. పాకిస్థాన్‌ కు గతంలో మహిళా ప్రధాని ఉన్నా అక్కడి మహిళల జీవితాలలో మాత్రం వెలుగులు నిండలేదు. హీనంగా - దీనంగా పాక్‌ మహిళలు ఆంక్షాల చక్రబంధంలో నలిగిపోయారు.

తాజాగా జరుగుతున్న ఎన్నికలలో పోటి చేస్తున్న 171 మంది మహిళలలో ఎక్కువ మందిని విజయం వరిస్తే పాక్‌ మహిళల జీవన గతి మారుతుందని ఓ ఆశ. అక్కడి మహిళలలో చాలా  మంది విద్యకు - ఉపాధికి దూరంగా ఉన్నారు. బురాఖ మాటున ధుర్బర జీవితాలను అనుభవిస్తున్నారు. అక్కడి ప్రభుత్వాల మతవిశ్వాసాల - ఉగ్రవాద సంస్థల ఆంక్షాల కారణంగా  చీకటిలో మగ్గిపోతున్నారు. ఈ ఎన్నికలలో ఎంత ఎక్కువ మంది మహిళలు విజయం సాధిస్తే వారికి అంత మంచిది. అధికారం కోసం పోటి పడుతున్న మూడు పార్టీలు మహిళలకు సీట్లు కేటాయించడం మంచి పరిణామం. నాలుగు  రాష్ట్రాలలో  272 జాతీయ అసెంబ్లీస్థానాలకు జరుగుతున్న పోటిలో ఏ మహిళా అభ్యర్ధులు విజయతీరాలకు చేరుతారో గురువారం తేలనుంది.


Tags:    

Similar News