పార్టీలకు పని చేస్తారా.. పార్టీ పెడతారా పీకే

Update: 2020-02-14 09:15 GMT
బీజేపీ, వైఎస్సార్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టికి పని చేసి విజయ తీరాలను చేర్చిన వ్యక్తి ప్రశాంత్ కిశోర్. రాజకీయ పార్టీలకు గెలుపు పాఠాలు చెబుతున్న ఇతడు తన రాజకీయ భవిష్యత్ ను చక్కదిద్దుకోలేక పోతున్నాడు. ఏళ్లుగా రాజకీయ పార్టీలతో సహవాసం చేస్తున్నాడు. ఆయన ఏ పార్టీ కోసమైతే పని చేస్తారో ఆ పార్టీకి ఎన్నికల్లో గెలుపు ఖాయమనే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఆయన తమిళనాడులో డీఎంకేకు, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు పని చేస్తున్నారు. కర్ణాటకలో తమ కోసం పని చేయాలని జేడీఎస్ తహతహలాడుతోంది. అయితే ఆయన రాజకీయంగా ఎదగానికి సొంతంగా పార్టీ చేసుకునే ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే ఈనెల 18వ తేదీన ఏదో ప్రకటిస్తాడట. ఆ ప్రకటన ఏంటో ఎవరికీ తెలియడం లేదు.

వివిధ పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగేందుకు నిర్ణయించారు. బీహార్‌లో జేడీయూలో చేరి ఇటీవల బహిష్కరణకు గురయ్యారు. అప్పటి నుంచి రాజకీయ నిరుద్యోగి అయ్యారు. ఆయన భవిష్యత్తు ఏమిటనే చర్చ అందరూ చర్చించుకుంటున్నాడు. రాజకీయ వ్యూహకర్తగానే వివిధ పార్టీలకు పని చేస్తూనే ఆయన పార్టీ పెడతారని లేదా మరో పార్టీలో చేరుతారనే వార్తలు షికార్లు కొట్టాయి. అయితే ఏ విషయమనేది

ఫిబ్రవరి 11వ తేదీ తర్వాత కీలక ప్రకటన చేస్తానని ప్రకటించారు. అయితే అది వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఫిబ్రవరి 18వ తేదీన పెద్ద ప్రకటన చేయబోతున్నట్లు ప్రశాంత్ కిశోర్ తెలిపారు. బిగ్ అనౌన్స్‌మెంట్ చేస్తానని చెప్పడంతో ఆయన చేయబోయే ప్రకటన ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది.ఒకవేళ ప్రశాంత్ కిశార్ కొత్త పార్టీ పెడుతా? పెడితే ఎవిరికి మద్దతు తెలుపుతాడు.. ఎవర్ని చేర్చుకుంటారనే అంశం చర్చనీయాంశంగా ఉన్నాయి. బీజేపీని వ్యతిరేకించడంతో జేడీయూ బహిష్కరణకు గురవడంతో ఆ పార్టీ బీజేపీకి పోరాడేందుకు ఆయన పార్టీకి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.






Tags:    

Similar News