టీడీపీకి రాజీనామాలపై యనమల రెండు రకాలుగా!

Update: 2019-11-04 12:15 GMT
'అధికారంలో ఉన్న పార్టీల్లోకి నేతల వలసలు మామూలే..' ఇదొక మాట. 'అధికార పార్టీ బెదిరింపుల వల్లనే నేతలు తెలుగుదేశం పార్టీని వీడి ఆ పార్టీలోకి చేరుతూ ఉన్నారు..' ఇది రెండో మాట.
తెలుగుదేశం పార్టీకి రెండు నాల్కల ధోరణి బాగా అలవాటు అయినట్టుగా ఉంది. ఏ వ్యవహారంలో అయినా చంద్రబాబు నాయుడు రెండు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు యూటర్న్ లూ తీసుకుంటూ ఉంటారు. ఆ తీరుతోనే చంద్రబాబు నాయుడు ప్రజల దృష్టిలో బాగా పల్చన అయ్యారు.

ఆయన పాలన కన్నా.. ఆయన వ్యవహరణ తీరే తెలుగుదేశం పార్టీకి పెద్ద ప్రతిబంధకంగా మారింది. అందుకే ఎన్నికల్లో అ పార్టీ అంత చిత్తుగా ఓడింది అనేది ఒక విశ్లేషణ. అయితే చంద్రబాబు నాయుడి తీరు ఎన్నికల తర్వాత కూడా అలానే ఉంది. మళ్లీ యూటర్న్ లు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఆ సంగతలా ఉంటే.. తెలుగుదేశం పార్టీకి కొనసాగుతున్న రాజీనామాల పట్ల ఆ పార్టీ సీనియర్ నేత యనమల రెండు రకాలుగా మాట్లాడారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ కి ఎమ్మెల్యేల రాజీనామాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో యనమల పై రకాలుగా స్పందించారు.

ఒక వైపు అధికార పార్టీల్లోకి వలసలు మామూలే అని తెలుగుదేశం పార్టీకి రాజీనామాలను తక్కువ చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ నేతలను బెదిరించి, చేర్చుకుంటోందన్నట్టుగానూ యనమల మాట్లాడారు.

మరి తమ పార్టీ నుంచి వెళ్లిపోయే వాళ్ల విషయంలో కూడా టీడీపీ ద్వంద్వ వైఖరితోనే ఉన్నట్టుంది. మరి టీడీపీనుంచి బయటకు వెళ్లే వాళ్లకేనే ఈ ద్వంద్వ థియరీలు, గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికీ వర్తిస్తాయా? యనమలే  చెప్పాల్సింది!
Tags:    

Similar News