రాష్ట్రపతి ఎన్నికల్లో గెలడానికి ఆయా పార్టీలపై ఒత్తిడి తేవడంతోపాటు ఆయా పార్టీలను ప్రత్యర్థులు (బీజేపీ) చీల్చారని విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా మండిపడ్డారు. అంతేకాకుండా డబ్బుతో ప్రలోభపెట్టారని.. డబ్బుతో ఓట్లు కొనుగోలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తన పోటీ ఒక పోరాటమని చెప్పారు.
జూలై 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాకుండా ప్రభుత్వ సంస్థలపై కూడా పోరాటం చేస్తున్నానని చెప్పారు. ప్రత్యర్థులు చాలా శక్తివంతంగా మారారని.. తమకే ఓటేయాలని ఆయా పార్టీలను ఒత్తిడి చేయడంతోపాటు డబ్బుతో ప్రలోభపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి ఎన్నికలు చాలా కీలకమైనవని యశ్వంత్ తెలిపారు. దేశ ప్రజాస్వామ్యానికి ఈ ఎన్నికలు మార్గాన్ని నిర్దేశిస్తాయని వెల్లడించారు. ఓటర్లందరూ తమ ఆత్మప్రబోధానుసారం ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుందని గుర్తు చేశారు. కాబట్టి ఓటర్లు వారి విచక్షణను ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తనకు ఓటేయాలని యశ్వంత్ సిన్హా విజ్ఞప్తి చేశారు.
కాగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తన ఓటును ద్రౌపది ముర్ముకు వేశారు. కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్షాలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకు కాకుండా ఎన్డీయే బలపరచిన ద్రౌపది ముర్ముకు ఆమె ఓటేశారు.
కాగా, తాను పొరపాటున ముర్ముకు ఓటు వేసినట్టు అధికారులకు సీతక్క తెలిపారు. ఈ క్రమంలో మళ్లీ ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరగా అధికారులు తిరస్కరించారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని సీతక్క మీడియాకు తెలపడంతో విషయం బయటకు వచ్చింది.