నోట్లో నుంచి మాట వస్తే ముఖం పగిలిపోవాలి. అంచనాలకు ఏ మాత్రం అందనంత ఆవేశపూరిత వ్యాఖ్యలు ఉండాలి. విన్నంతనే వణుకు పుట్టేలా.. వీళ్లతో మాట్లాడటం కంటే మౌనంగా ఉంటే సరిపోతుందన్నట్లుగా ఉండేలా మాట్లాడటం ఏపీ రాజకీయాల్లో ఎవరికి సాధ్యం? అన్న ప్రశ్నను సంధిస్తే వచ్చే సమాధానం వైసీపీ. ఏపీ రాజకీయాల్లో ముతక భాషను అధికార భాషగా మార్చేసి.. అదే ఒక ఆభరణంగా తయారు చేసిన వేళ.. అలాంటి తీరుతో.. వారికి సమాధానం చెప్పే పనిలో తయారైందో మహిళా నేత. ఆమె.. టీడీపీకి చెందిన గ్రీష్మ. ఇవాళ.. తెలుగు రాజకీయాల్లో ఆమె ఒక సంచలనంగా మారారు. మహానాడు మొదటి రోజున ఆమె ఇచ్చిన ఒకే ఒక్క స్పీచ్ కు ఎక్కడెక్కడి వైసీపీ నేతలు స్పందిస్తున్నారు.
మర్యాద గురించి.. రాజకీయాల్లో విలువల గురించి.. ఇలా కొత్త కొత్త పదాల్ని వెతుక్కుంటూ వార్తలు రాసేస్తూ.. కిందా మీదా పడుతున్నారు. మరీ.. ఇంత దారుణంగా మాట్లాడతారా? అంటూ గుండెలు బాదేసుకుంటూ.. నోరు నొక్కుకుంటున్న వైసీపీ నేతల తాజా ఆక్రోశానికి కారణం సీనియర్ నేత ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ. ఆమె ఎందుకంత సంచలనమైంది?ఆమె మాటలకు వైసీపీ నేతలు ఎందుకంతగా ఫీల్ అవుతున్నారు? అంటే.. దానికో కారణం లేకపోలేదు.
ఇంతకాలం ఏపీ రాజకీయాల్లో నోటికి అడ్డూ ఆపు లేకుండా మాట్లాడే నేతలు వైసీపీలోనే ఉన్నారు. ఆ పార్టీకి వారంతా తిరుగులేని అస్త్రాలుగా ఉండేవారు. వారి చేతికి మైకులు ఇస్తే.. నిద్రలోనూ తమ మాటలతో ఉలిక్కిపడేలా ప్రత్యర్థి నేతల్ని చేస్తున్న వారికి.. ఇప్పుడు అలాంటి మాటల మిస్సైల్ ఒకటి ప్రత్యర్థి పార్టీకి దొరికితే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తకుండా ఉంటాయా? ఇంతకీ మహానాడులో గ్రీష్మ స్పీచ్ కు సంబంధించిన రెండు.. మూడు మచ్చు తునకులు చూస్తే.
"ఓ వైసీపీ కుక్క ఈ మధ్య నన్నో ప్రశ్న వేసింది. నిన్నెవరైనా రేప్ చేశారా? అని అడిగింది. ఇప్పుడు అడుగుతున్నా....మిస్టర్ సీఎం, మిస్టర్ జగన్‌మోహన్‌రెడ్డి 30 రోజుల్లో 60 మందిని రేప్ చేస్తే, నువ్వు స్విట్జర్లాండ్‌కు వెళ్లి, మీ పెళ్లాంతో పబ్బం గడుపు తావా? నీకు మనస్సాక్షి అనేది లేదా? ఆడవాళ్ల పుస్తెలు తెంచి, నీ పెళ్లాంతో నువ్వు షికార్‌కు వెళ్తావా?
"జె డ్రగ్స్, జె బ్రాండ్స్ అమ్ముకుని వాటికి వచ్చిన డబ్బుతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి మహిళా తాళి తెంపి, నువ్వు పబ్బం గడుపుకుంటావా? నీకు నిద్ర ఎలా పడుతోంది జగన్‌మోహన్‌రెడ్డి?""సార్ (వేదికపై ఉన్న చంద్రబాబును ఉద్దేశించి) ఎవరెన్ని అన్నా మీకు మేం వాగ్దానం చేస్తున్నాం. ఎవడైనా సరే, జగన్‌మోహన్‌రెడ్డి అని ఇంటికొచ్చినా, బస్సు యాత్ర అని వచ్చినా, బస్సులో నుంచి ఈడ్చి ఈడ్చి తంతాం సార్. నా కొడకల్లారా రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారు. సిగ్గూశరం లేకుండా బస్సులో వెళ్తారా? బస్సులో నుంచి ఈడ్చి తన్నక పోతే (తొడ కొట్టి) తెలుగుదేశం గడ్డ మీద పుట్టినోళ్లం కాదు.
ఇంత ఘాటుగా టీడీపీ నేతల నోటి నుంచి మాటలు రావటానికి ఎన్ని దశాబ్దాలు పట్టాలి? వైసీపీ నేతల పుణ్యమా అని ఇలాంటి భాషను త్వరగానే వంట పట్టేసుకున్న గ్రీష్మ.. ఇప్పుడు వారికి కొత్త సవాలుగా మారారు. తమ 'భాష'ను క్రాక్ చేయటం సాధ్యం కాదన్న ధీమాతో ఉన్న వైసీపీ పరివారానికి అందుకు భిన్నంగా ఇట్టే అర్థం చేసుకోవటమే కాదు.. తర్వాతి వెర్షన్ లోకి వెళ్లేందుకు సైతం సిద్ధమన్నట్లుగా గ్రీష్మ స్పీచ్ ఉండటంతో ఇప్పుడు వారంతా కొత్త ఎత్తుగడకు తెర తీశారు.
అదేటంటి.. సంస్కారం లేకుండా చిల్లర మాటలు మాట్లాడతారా? ఈ మాటలు వింటే ఆమె తల్లిగారైన ప్రతిభా భారతిగారు కన్నీరు పెట్టుకోవటం ఖాయం. ఆమె తాతగారి ఆత్మ శోకించటం పక్కా అంటూ పడికట్టు మాటల్ని వల్లిస్తున్నారు. అంతేకాదు..ఇప్పటివరకు పెద్దగా ఇమేజ్ లేని గ్రీష్మ..మహానాడు పుణ్యమా అని ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకోవటం.. ఆమె ప్రసంగానికి భారీగా ప్రతిస్పందన రావటంతో ఇప్పుడు ఆమెను టార్గెట్ చేయాలన్న లక్ష్యాన్ని సిద్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది.
ఇందుకు తగ్గట్లే.. గ్రీష్మ మాటలు మర్యాదస్తులకు ఏ మాత్రం సరిపోనివి.. ఒక మహిళ అయి ఉండి అలా మాట్లాడతారా? అంటూ కొత్త నీతుల్ని షురూ చేశారు. అంతేకాదు.. గ్రీష్మ ఇమేజ్ ను భారీగా దెబ్బ తీసే కార్యక్రమానికి తెర తీసి.. గడిచిన రెండు రోజులుగా ఆ పనిలో బిజీగా ఉన్నారు. ఇదంతా చూసినప్పుడు.. వైసీపీ బ్యాచ్ కు సరైన సమాధానం చెప్పే అస్త్రం తెలుగుదేశం పార్టీకి దొరికిందన్న మాట వినిపిస్తోంది.