వైసీపీ మంత్రి.. ఎన్టీఆర్‌పై నీచ‌మైన కామెంట్లు.. జ‌గ‌న్ ఫైర్‌!?

Update: 2022-09-26 11:36 GMT
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీలో పెను దుమారమే రేగుతున్న విషయం తెలిసిందే. దీని నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలా.. అని ప్ర‌భుత్వం త‌ల‌ప‌ట్టుకుంది. ఒక‌వైపు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ.. మ‌రోవైపు ఎన్టీఆర్ కుటుంబం.. ఇంకోవైపు నుంచి ఎన్నారైలు.. మేధావులు.. ఎన్టీఆర్ అభిమాన సంఘాలు.. సీనియ‌ర్ సిటిజ‌న్లు.. పొరుగు రాష్ట్రాల నాయ‌కులు.. విరుచుకుప‌డుతున్నారు. దీంతో ఏపీ స‌ర్కారుకు త‌ల బొప్పిక‌డుతోంది. దీంతో దీని నుంచి బ‌య‌ట‌ప‌డ‌డంపై ఆలోచ‌న చేస్తోంది.

అవ‌స‌ర‌మైతే.. బిల్లును వెన‌క్కి తీసుకునే ఆలోచ‌న కూడాచేస్తున్నార‌ని.. తాడేప‌ల్లి వ‌ర్గాలుచెబుతున్నాయి. ఇక‌, ఇలాంటి కీల‌క‌మైన‌.. సున్న‌త వ్య‌వ‌హారంపై సాక్ష‌త్తూ..  ఏపీ సీఎం జగనే ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తు న్నారు.  

తనకూ ఎన్టీఆర్ అంటే అభిమానం ఉందంటూ.. ఆచి తూచి మాట్లాడుతున్నారు. అనున‌య వాక్యాలు చెబుతున్నారు. ఎక్క‌డా ఎన్టీఆర్‌పై ప‌న్నెత్తు మాట కూడా అన‌లేదు. ఇక‌, మంత్రులు, ఇత‌ర నేతులు కూడా.. జ‌గ‌న్ బాట‌లోనేన‌డిచారు.

 అయితే.. దీనికి విరుద్ధం మంత్రి దాడిశెట్టి రాజా  మాత్రం నోటికి పని చెప్పారు. ఎన్టీఆర్‌పై అత్యంత వివా దాస్ప‌ద‌.. సంచలన వ్యాఖ్యలు  చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ అంత చేత కాని వ్యక్తి దేశంలో ఎక్కడా లేడని విమర్శించారు. సీఎంగా ఉండి కూడా రెండు సార్లు వెన్నుపోటు పొడిపించుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని గుప్పిట్లో ఉంచుకుని కూడా నాదెండ్ల మ‌నోహ‌ర్‌, చంద్రబాబు తో రెండుసార్లు వెన్నుపోటు పొడిపించుకున్న నేత ఎన్టీఆర్ అని విమర్శించారు.

అంతేకాదు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎన్టీఆర్‌కు అసలు పోలికే లేదని మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కుటుంబంపైనా ఆయ‌న విరుచుకుప‌డ్డారు.

దీంతో ఇప్పుడు మ‌రో కొత్త వివాదానికి.. ఆయ‌న ఆజ్యం పోసిన‌ట్టు అయింద‌నిఅంటున్నారు వైసీపీ నాయ‌కులు. దీనిపై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్ కావ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఆయ‌న‌తోరాజీనామా చేయించ‌డం లేదా.. మీడియా ముఖంగా ఆ వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకుని.. క్ష‌మాప‌ణ‌లు అయినా.. చెప్పిస్తార‌ని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News