పోలీసు వ్యవస్థతో తనకు అనుకూలంగా పనిచేయించుకోవడం, వారిని కట్టుబానిసల్లా వాడుకోవడం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం నైజం. అలాగే, అదే పోలీసులను, పోలీసు అధికారులను హేళన చేస్తూ, చులకనా మాట్లాడటం కూడా టీడీపీ నేతలకు పరిపాటి. గతంలో అనంతపురం జిల్లాలో సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా పనిచేసిన గోరంట్ల మాధవ్ పై ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. --ఏరా! నీయబ్బ నువ్వు నాకు సెల్యూట్ ఎన్ని సార్లు కొట్టావో గుర్తుందా? నా ముందు సెల్యూట్ కొట్టేవాడివి నన్నే ఛాలెంజ్ చేస్తావా? అంటూ తిట్టడమే కాదు నువ్వు ఖాకీ బట్టలు తీసి రా! నేను ఖద్దరు బట్టలు తీసి వస్తా తేల్చుకుందాం!.. అని దివాకర్ రెడ్డి గతంలో వ్యంగ్యంగా సవాలు విసిరారు. అంతే కాదు, పోలీసు వ్యవస్థనే కించ పరిచేలా వ్యాఖ్యలు చేస్తూ, పోలీసులు కొజ్జాలు అన్నారు. మీరు ఇంతే! అనే అర్థం వచ్చేలా పోలీసుల ముందే హిజ్రాలతో నృత్యం చేయించారు. ఇంత జరిగినా, వెనుకబడిన కులాలకు చెందిన ఓ పోలీసు అధికారిని తన పార్టీకే చెందిన ఎం.పీ. నానామాటలు అన్నాసరే,.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కిమ్మనలేదు. ఇది సరికాదంటూ మాట మాత్రమైనా, ఎం.పి. దివాకర్ రెడ్డిని మందలించలేదంటే పోలీసు వ్యవస్థపై, అందులోనూ బీసీలపై ఆయనకు ఎంతమాత్రం గౌరవం ఉందో తేటతెల్లమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
వెనకబడిన తరగతికి చెందిన గోరంట్ల మాధవ్ ను తూలనాడుతూ పాలకపక్షం ఎం.పి. ఎగతాళిగా మాట్లడగా,.. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన అదే మాధవ్ ను పార్లమెంటుకు పంపించి సమున్నత గౌరవం అందించేందుకు వైఎస్సార్స్పీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంకల్పించారు. అనంతపురం జిల్లా హిందూపురం లోక్ సభ నియోజకవర్గానికి అభ్యర్థిగా మాధవ్ కు అవకాశమిచ్చి గౌరవించారు. ఓ ఎంపీ చేత అవమానానికి గురైన గోరంట్ల మాధవ్ జరిపిన పోరాటంతో జిల్లా వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఏర్పడ్డారని, హిందూపురం నియోజకవర్గ ప్రజల సంపూర్ణ మద్దతు మాధవ్ కు ఉందని, ఈ ఎన్నికల్లో ఆయన విజయం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల అనంతరం మాధవ్ ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టడం తథ్యమని జనం అంటున్నారు. తనను అవమానించిన జేసీ కి సెల్యూట్ కాదు, ఆయన స్థాయికి తగ్గని రీతిలో పార్లమెంటు సభ్యుడిగా గౌరవ మర్యాదలు అందుకోవాలని వారు ఆశిస్తున్నారు. కేవలం కథలు, సినిమాల్లో మాత్రమే సాధ్యమనిపించే ఈ పరిణామం జగన్ సుసాధ్యం చేయబోతున్నారని జనం అంటున్నన్నారు.