ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉంటే తన ప్రత్యర్థులను ఓ ఆట ఆడుకుంటుంది. ముఖ్యంగా ఏపీలో మనకు ఈ పరిస్థితి కనిపిస్తుంది. 2014లో ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీని టీడీపీ ఎదగకుండా చేసిందనే ఆరోపణలున్నాయి. ఆ పార్టీలోని నాయకులను టీడీపీలో చేర్చుకొని ఫ్యాన్ పార్టీని బలహీనంగా చేసిందనే వాదన ఉంది. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ, టీడీపీ నాయకులను అదే పని చేస్తుందన్న చర్చ సాగుతుంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు కుమారుడు లోకేశ్ ను వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ నిద్రలేకుండా చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కుమారుడు లోకేశ్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించాడని టాక్ ఉంది. లోకేష్ ఎమ్మెల్యే కాకపోయినా, ఎమ్మెల్సీ ద్వారా ఆయనను ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని చేశారు. ఆ సమయంలో లోకేశ్ కు చెందిన సోషల్ మీడియా టీం వైసీపీ గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పోస్టులు పెడుతూ విమర్శలు గుప్పించారు. ఓ రకంగా తాను సోషల్ మీడియా ద్వారా ఆ సమయంలో ప్రజలకు వైసీపీపై నమ్మకం లేకుండా చేశారని చెప్పొచ్చు. అయితే అదే ఇప్పుడు చంద్రబాబు కొంప ముంచిందని అంటున్నారు.
జగన్ స్వయంగా పాదయాత్ర చేసినప్పుడు వైసీపీకి చెందిన సోషల్ మీడియా టీం లోకేశ్ పై రకరరాలుగా పోస్టులు పెట్టారు. లోకేశ్ కు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఫేస్ బుక్, యూట్యూబ్లో పెట్టి ట్రోల్ చేశారు. లోకేశ్ అక్కడక్కడా ఆయన తెలుగులో మాట్లాడిన కొన్ని తప్పులను వెతికి వైసీపీ సోషల్ మీడియా టీం వాటిని హైలెట్ చేసి వైరల్ చేసింది. ఒక రకంగా ఇది వైసీపీకి బాగా కలిసొచ్చింది. దీంతో లోకేశ్ ‘CMS’ ఉండే ఓ చెన్నై కంపెనీతో మాట్లాడి వైసీపికి చెందిన ఎఫ్ బి, యూట్యూబ్ అకౌంట్లను క్లోజ్ చేయించారట.
ఈ పరిణామంతో వైసీపీ వాళ్లు బాగా నష్టపోయారట. అయితే నగరి ఎమ్మెల్యే రోజాకు చెందిన అకౌంట్ ను కూడా మూసివేశారని అప్పట్లో ఆరోపించారు.కానీ వైసీపీనే ప్రజలు నమ్మి గెలిపించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ.. లోకేశ్ పై మరోసారి ట్రోలింగ్ చేస్తున్నారట. దీంతో లోకేశ్, ఆయన టీం అలా చేసిన వారిపై కేసులు పెడుతున్నామని బెదిరిస్తున్నాడట. అయితే కొందరు వైసీపీ నాయకులు అప్పుడే మమ్మల్ని ఏం చేయలేదు.. ఇప్పుడు మా పార్టీ అధికారంలో ఉంది కనుక ఇప్పుడేం చేస్తావ్..’ అని లోకేష్ కు కౌంటర్ పోస్టులు పెడుతున్నారట. మరి రాబోయే రోజుల్లో లోకేశ్, ఆయన సోషల్ మీడియా టీం ఏవిధంగా యాక్టివ్ అవుతుందో చూద్దాం..