పట్టపగ్గాల్లేని సెన్సార్ కు వీలులేని సోషల్ మీడియాలో ఎవరు ఏదైనా మాట్లాడుకోవచ్చు.తన స్వేచ్ఛను బయటపెట్టవచ్చు. అయితే మీ వ్యక్తిగత అభిప్రాయల వరకూ ఓకే. కానీ మనకు నచ్చని వారిని టార్గెట్ చేసి హింసించడమే దారుణం. సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడంతో ప్రముఖులు, వారి కుటుంబాలు టార్గెట్ అవుతున్నాయి. ట్రోలింగ్ కు గురవుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కూడా దీనికి బాధితుడిగా మారాడు.
తన భార్యాపిల్లలపై సోషల్ మీడియాలో దుర్మార్గమైన పోస్టులు పెడుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వాపోయారు. తనకు ప్రత్యర్థులే తప్ప శత్రువులు ఎవరూ లేరని ఆయన చెప్పుకొచ్చాడు. కోటం రెడ్డి చేసిన ఈ కామెంట్స్ పెనుదుమారం రేపుతున్నాయి.
వైఎస్ కుటుంబానికి వీరవిధేయుడిగా కోటంరెడ్డి కుటుంబం ఉంటూ వస్తోంది. వైఎస్ఆర్ మరణం అనంతరం జగన్ వెంట నడిచారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టికెట్ పై కోటంరెడ్డి నిలిచి గెలిచారు. నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో ఢీ అంటే ఢీ అనేలా విభేదాలు ఉన్నా జగన్ కోసం భరించారు. ఇప్పటికీ నెల్లూరు రూరల్, సిటీ ఎమ్మెల్యేలైన వీరిద్దరికీ అస్సలు పడదు.
జగన్ ఎక్కువగా అనిల్ కుమార్ యాదవ్ కే ప్రాధాన్యం ఇస్తున్నాడని కోటంరెడ్డి కొద్దిరోజులుగా మౌనం దాల్చారు. తాజాగా బరెస్ట్ అయ్యారు. తనపై ప్రజాదరణను ఓర్వలేని కొందరు దురుద్దేశంతో అవాకులు చెవాకులు పేలుతున్నారని.. హద్దులు దాటి తన భార్య, పిల్లలపైన దుర్మార్గమైన పోస్టులు పెడుతున్నారని వాపోయారు.
తాను ఎవరినీ రాజకీయ ప్రత్యర్థులుగా చూడడం లేదని మరోసారి స్పష్టం చేశారు. తన కుటుంబ సభ్యులపై కూడా నీచమైన పోస్టులు పెడుతున్నాడని వాపోయాడు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తానన్నాడు. కార్యకర్తలు రెచ్చిపోవద్దని విజ్ఞప్తి చేశాడు.
అయితే కోటంరెడ్డి ఇలా తనను సోషల్ మీడియాలో విమర్శించేవారు ఎవరన్నది మాత్రం బయటపెట్టలేదు. అది టీడీపీ వారా? లేక వైసీపీ ప్రత్యర్థులా ? అన్నది తేలాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.