కోల్ కతాలో సీబీఐ-పశ్చిమ బెంగాల్ పోలీసుల మధ్య తలెత్తిన ఘర్షణ దేశాన్ని కుదిపేసింది. రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం - సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ గొడవను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇరువర్గాలూ ఎంతకూ పట్టు వీడలేదు. దీదీ ఏకంగా ధర్నాకు దిగారు. దీంతో కేంద్రానికి మద్దతుగా కొన్ని పార్టీలు - మమతకు మద్దతుగా కొన్ని పార్టీలు ముందుకొచ్చాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గొడవ తాత్కాలికంగా సద్దుమణిగింది.
తాజాగా ఈ ఘర్షణపై వైసీపీ స్పందించింది. తమ స్టాండ్ ఏంటో తెలియజేసింది. కోల్ కతా ఎపిసోడ్ లో మమత ప్రవర్తించిన తీరు సరికాదని అభిప్రాయపడింది. వైసీపీ సీనియర్ నేత - ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి స్పందిస్తూ.. ఈ వివాదంలో మమతదే తప్పు అని చెప్పారు. ఆమెకు తాము మద్దతివ్వట్లేదని స్పష్టం చేశారు. సీబీఐ సోదాలను వ్యతిరేకించడం ద్వారా దీదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించారని విమర్శించారు. ఆమె తప్పేమీ లేకుంటే దర్యాప్తులో సహకరించి ఉండేది కదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను విస్మరించి.. అవినీతి అధికారులను ఆమె రక్షించారంటూ విమర్శలు గుప్పించారు.
వైసీపీ స్పందనను పలువురు రాజకీయ విశ్లేషకులు సమర్థిస్తున్నారు. పార్టీ స్టాండ్ ను అభినందిస్తున్నారు. రాజకీయాలకు తలొగ్గకుండా రాజ్యాంగాన్ని గౌరవించేలా వైసీపీ స్పందించిందని వారు అభిప్రాయపడుతున్నారు. శారదా కుంభకోణం కేసులో కోల్ కతా నగర పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ ను ప్రశ్నించేందుకు సీబీఐని ఆమె అనుమతించాల్సిందని.. ఏ తప్పూ చేయకపోయి ఉంటే ఆయన నిర్దోషిగా బయటపడతారు కదా అని వారు పేర్కొన్నారు. మమత తీరును వ్యతిరేకించడం ద్వారా కోల్ కతా ఎపిసోడ్‌లో కేంద్రానికి వైసీపీ మద్దతు పలికినట్లయిందని మరికొందరు భాష్యం చెబుతున్నారు.