నిరాశ పరిచిన అంబటి రాయుడు... ఇంటికి వచ్చేశాడు!
ఈ క్రమంలో కేవలం మూడు మ్యాచ్ లే ఆడిన రాయుడు.. అభిమానులను నిరాసపరిచే ఫెర్ఫార్మెన్స్ చేశాడు.
క్రికెట్ కెరీర్ కు ముగింపు పలికిన అంబటి రాయుడు.. త్వరలో పాలిటిక్స్ లో ఎంటరై తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారంటూ కథనాలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ గ్యాప్ లో తాజాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్ - 2023 లో పాల్గొన్న రాయుడు... మూడు మ్యాచులకే ఈ టూర్ ను ముగించేశారు.
అవును... టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కరేబియన్ ప్రీమియర్ లీగ్ - 2023 లో పాల్గొనేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేవలం మూడు మ్యాచ్ లే ఆడిన రాయుడు.. అభిమానులను నిరాసపరిచే ఫెర్ఫార్మెన్స్ చేశాడు. ఈ నేపథ్యంలో కేవలం మూడు మ్యాచ్ లే ఆడిన ఆయన... తిరుగుప్రయాణమయ్యాడు.
అయితే... కరేబియన్ టూర్ మూడు మ్యాచ్ లతోనే ముగించడం వెనుక రాయుడు వ్యక్తిగత కారణాలే కారణాలని తెలుస్తుంది. ఇక ఈ టూర్ లో భాగంగా మొత్తం మూడు మ్యాచ్ లు ఆడిన రాయుడు... మొదటిమ్యాచ్ లో డక్కౌట్ అవ్వగా... మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ వరుసగా 32, 15 పరుగులు మాత్రమే చేశాడు.
మొత్తంగా ఈ 3 మ్యాచ్ లూ కలిపి 15.66 సగటున 117.50 స్ట్రయిక్ రేట్ తో 47 పరుగులు చేసిన రాయుడు అభిమానులను నిరాశపర్చాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుకు రాయుడు ప్రాతినిథ్యం వహించాడు. దీంతో... ప్రవీణ్ తాంబే తర్వాత కరీబియన్ లీగ్ ఆడిన రెండో భారత క్రికెటర్ గా రికార్డుల్లోకెక్కాడు.
కాగా... ఐపీఎల్ 2023 తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు, భారత దేశవాలీ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రాయుడు.. బీసీసీఐతో బంధాన్ని తెంచుకుని, ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడాడు. ఈ క్రమంలో త్వరలో పాలిటిక్స్ లో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నాడనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి!