'నేను అమ్మాయినే'... పసిడి పంచ్ తో ప్రపంచానికి చెప్పిన ఖెలిఫ్!
పారిస్ ఒలింపిక్స్ లో అత్యంత వివాదాస్పద అంశంగా ఖెలిఫ్ వర్సెస్ ఏంజెలా కెరానీ మధ్య జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్ మారిన సంగతి తెలిసిందే.
పారిస్ ఒలింపిక్స్ లో అత్యంత వివాదాస్పద అంశంగా ఖెలిఫ్ వర్సెస్ ఏంజెలా కెరానీ మధ్య జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్ మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఖెలిఫ్ కేవలం 46 సెకన్లలోనే బౌట్ ముగించింది. ఆమె విసిరిన పంచ్ కు ఇటలీ క్రీడాకారిని ఏంజెలా విలవిల్లాడింది.. బౌట్ పూర్తికాకముందే వైదొలికింది. ఈ సమయంలో ఖెలిఫ్.. అమ్మాయి కాదంటూ నెట్టింట వివాదం మొదలైంది.
ఈ సమయంలో ఈ అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్ విపరీతమైన ట్రోలింగ్స్ ని ఎదుర్కొంది. ఇదే సమయంలో... ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈమెపై కామెంట్లు చేశారు. ఇదే సమయంలో ఈమెను అనుమతించిన ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీపైనా తీవ్ర విమర్శలు చేశారు. ఇంత ఒత్తిడి, అవమానాల మధ్య కూడా ఇమానె ఖెలిఫ్ సత్తా చాటింది. బంగారు పతకం సాధించింది.. తాను అమ్మాయినే అని నొక్కి చెప్పింది!
అవును... పారిస్ ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ 66 కేజీల ఫైనల్స్ లో చైనా బాక్సర్ యాంగ్ లియును ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది అల్జీరియా క్రీడాకారిని ఇమానె ఖెలిఫ్. ఈ సమయంలో ఇంతకాలం తనలో గూడు కట్టుకుపోయిన వేదనను ఒక్కసారిగా వెళ్లగక్కింది. అందరిముందూ "నేను అమ్మాయినే" అంటూ బిగ్గరగా చెప్పింది. ప్రపంచానికి వినిపించేలా, మరోమారు తనపై విమర్శలు రాకుండా వెల్లడించింది.
ఈ సందర్భంగా స్పందించిన ఆమె... "నేను ఆడపిల్లగానే జన్మించా.. అలాగే పెరిగా.. భవిష్యత్తులో తనపై ఇలాంటి దాడులు పునరావృతం కావని ఆశిస్తున్నా.. ఇప్పటితో నా ఎనిమిదేళ్ల కల నెలవేరింది.. ఇప్పుడు నేనొక ఒలింపిక్ ఛాంపియన్.. గోల్డ్ మెడలిస్ట్ ని అని గట్టిగా చెప్పింది.
కాగా.. ఇమానె ఖెలిఫ్ అల్జీరియాలోని తియారెట్ ప్రాంతానికి చెందిన బాక్సర్ అనే సంగతి తెలిసిందే. అయితే ఈమె ఈ ఆటవైపు వెళ్లడం ఆమె తండ్రికి ఇష్టం లేదు. అయినప్పటికీ ప్రపంచస్థాయి క్రీడల్లో బంగారు పతకం గెలవాలని ఖెలిఫ్ ఆకాంక్షించింది. ఈ క్రమంలో 2021 టోక్యో ఒలింపిక్స్ లో క్వార్టర్ ఫైనల్స్ లో ఓటమిపాలైంది. దీనికి తోడు 2023లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో లింగ సమస్య ఎదురైంది.!
ఈ సమయలో ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఆమెను పక్కన పెట్టింది. అందుకు కారణం ఆమెలో ఎక్స్, వై క్రోమోజోములు ఉన్నాయని పేర్కొంది! ఇదే సమయంలో ఆమెలో టెస్టోస్టిరాన్ పురుషుల్లో ఉండే స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. అయితే... తాజాగా అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ మత్రం ఈమెకు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఖెలిఫ్ పసిడి పంచ్ తో చెలరేగింది.