వీడియో వైరల్: ఆజామో... ఇదేమి చెత్త రివ్యూ?
ఆ సంగతి అలా ఉంటే... ఎవరూ ఊహించని రీతిలో పాకిస్థాన్ కెప్టెన్.. ఎల్బీడబ్ల్యూ అప్లై చెస్తూ ఒక రివ్యూ తీసుకున్నాడు. దీంతో... ఈ వరల్డ్ కప్ లో ఇదే అత్యంత చెత్త రివ్యూ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
వన్డే ప్రపంచకప్ - 2023లో భాగంగా బెంగళూరు వేదికగా పాకిస్తాన్ - ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ నిర్ణాన్ని తప్పుబడుతున్నట్లుగా ఆస్ట్రేలియా ఓపెనర్లు చెలరేగిపోయారు. జాకిర్ హుస్సేన్ తబలా వాయించినట్లు.. శివమణి జాజ్ వాయించినట్లు... వేసుడు - కొట్టుడు, వేసుడూ - కొట్టుడూ అన్నట్లుగా స్వైర విహారం చేశారు.
అవును... తొలుత బ్యాటింగ్ కి వచ్చిన ఆస్ట్రేలియా ఓపెనర్లు డెవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ లు చెలరేగిపోయారు. ఆకాశమే హద్దుగా బ్యాట్ కు పనిచెప్పారు. స్పిన్నర్, సీమర్ అనే వ్యత్యాసం చూపించలేదు. వీలైనంతవారకూ ఫీల్డర్లకు బంతి వెంట పరుగులు పెట్టాల్సిన అవసరం లేకుండా... మెరుపు వేగంతో బౌండరీలకు తరలించారు. నువ్వా నేనా అన్నట్లుగా వీరిద్దరూ బౌలర్లతో కాకుండా... వీరికి వీరు పోటీపడి షాట్లు ఆడారు.
ఈ క్రమంలో 124 బంతులు ఆడిన 14 ఫోర్లు, 9 సిక్సర్లతో 163 పరుగులు చేశాడు. అంటే 110 పరుగులు బౌండరీలతోనే రాబట్టాండంటే... దాడి ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు మిచెల్ మార్ష్ 108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్లతో 121 పరుగులు చేశాడు. అంటే... 94 పరుగులు బౌండరీలతోనే రాబట్టాడన్నమాట. దీన్ని బట్టి వీరి దండయాత్ర ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు.
ఆ సంగతి అలా ఉంటే... ఎవరూ ఊహించని రీతిలో పాకిస్థాన్ కెప్టెన్.. ఎల్బీడబ్ల్యూ అప్లై చెస్తూ ఒక రివ్యూ తీసుకున్నాడు. దీంతో... ఈ వరల్డ్ కప్ లో ఇదే అత్యంత చెత్త రివ్యూ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ వీడియో చూస్తే చాలా మందికి అదే అభిప్రాయం కలిగే అవకాశం ఉంది! ఇందులో భాగంగా... తొలి ఓవర్ లో అఫ్రిది వేసిన మొదటి బంతిని డేవిడ్ వార్నర్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు.
అయితే ఆ సమయంలో బంతి బ్యాట్ కు తాకి ప్యాడ్ కు తగిలింది. ఇది స్పష్టంగా కనిపించింది! కానీ షాహీన్ అఫ్రిది మాత్రం ఎల్బీకి గట్టిగా అప్పీల్ చేశాడు. అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు. అయితే పాక్ కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం ఆఖరి సెకెండ్ లో రివ్యూకు వెళ్లాడు. అయితే రిప్లేలో మాత్రం బంతి క్లియర్ గా బ్యాట్ కు తాకినట్లు కన్పించింది. దీంతో థర్డ్ అంపైర్ కూడా నాటౌట్ గా ప్రకటించాడు.
దీంతో పాకిస్తాన్ ఆటగాళ్ల ముఖాలు వాడిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో కొంచెం కూడా తెలివి లేకుండా చెత్త రివ్యూ తీసుకున్నాడు అంటూ బాబర్ ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఆ రివ్యూ అనంతరమే ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ ఊచ కోత మొదలైంది. అక్కడ నుంచి మొదలు 259 పరుగుల వరకూ వికెట్ సంగతి దేవుడెరుగు.. కనీసం అప్పీల్ కూడా లేదన్నట్లుగా వీరి భాగస్వామ్యం నడించింది.
ఈ సమయంలో 259 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. దూకుడు మీదున్న మిచెల్ మార్ష్ 33.5 ఓవర్లో 121 పరుగుల వద్ద షాహీన్ అఫ్రీద్ బౌలింగ్ లో ఉసామ మిర్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 భారీ స్కోర్ చేసింది.