వరల్డ్ కప్ కు పాక్ భారీ ప్రణాళిక.. రంగంలోకి దిగ్గజ బ్యాట్స్ మన్

ఇంజమామ్ ను చీఫ్ సెలక్టర్ గా రెండోసారి నియమించింది. 2016-19 మధ్య అతడు ఓసారి చీఫ్ సెలక్టర్ గా వ్యవహరించాడు

Update: 2023-08-08 12:01 GMT

మా దేశంలో జరిగే ఆసియా కప్ లో మీరు ఆడట్లేదు కాబట్టి.. మీ దేశంలో ప్రపంచ కప్ లో మే పాల్గొనం అంటూ నిన్నటివరకు బీష్మించుకు కూర్చున్న పాకిస్థాన్ ఆ బెట్టు వీడి సన్నద్ధతపై చూపుసారించింది. వన్డే ప్రపంచ కప్ లో పాల్గొనమనే బెదిరింపుల నుంచి మెల్లమెల్లగా గట్టి జట్టును తయారుచేసుకునే పనిలో ఉంది. ఆటగాళ్ల ఎంపికలో ఎలాంటి పొరపాటు లేకుండా చూసుకునేందుక దిగ్గజ క్రికెటర్ ను రంగంలోకి దింపింది. అది కూడా అనూహ్యంగా కావడం గమనార్హం.

సరిగ్గా రెండు నెలల ముందు 1992 వన్డే ప్రపంచ కప్ లో విజేతగా నిలిచి 1999 కప్ లో రన్నరప్ స్థానంతో సరిపెట్టుకుంది పాకిస్థాన్. అయితే 2003 కప్ నుంచి ఆ జట్టు ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. వసీం అక్రమ్, వకార్ యూనిస్, ఇంజమాముల్ హక్ వంటి దిగ్గజాలున్నప్పటికీ కప్ నెగ్గలేకపోయింది. పాకిస్థాన్ వన్డే ప్రపంచ విజేతగా నిలిచి 30 ఏళ్లు దాటిపోయింది.

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లలో జరిగిన టోర్నీల్లో విజయం సాధించడం కొంచెం కష్టమే. కానీ, ఉప ఖండంలోని భారత్ లో ఆడడం వారికి ఎంతో ఇష్టం. వాతావరణం, పిచ్ లు అన్నీ ఒకేలా ఉండడమే దీనికి కారణం. అందులోనూ బాబర్ ఆజామ్, మొహమ్మద్ రిజ్వాన్ వంటి గొప్ప బ్యాట్స్ మెన్, షాహీన్ ఆఫ్రిది, నసీమ్ షా వంటి మేటి పేసర్లు ఆ జట్టకు ఉన్నారు. ప్రపంచ కప్ కొట్టాలంటే ఈ యువ జట్టుకు పెద్ద కష్టమేం కాదు. ఈ నేపథ్యంలోనే మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్ మన్ ఇంజమాముల్ హక్ ను రంగంలోకి దించింది.

రెండోసారి ఇంజమామ్ కు బాధ్యతలు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంటే రాజకీయాలు, పైరవీలమయం. దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సంస్కరణలు చేపట్టాలని చూశారు. దశాబ్దాలుగా పాక్ బోర్డులో అవకతవకలు పేరుకుపోయాయి.

మరోవైపు ఆటగాళ్లలోనూ క్రమశిక్షణా రాహిత్యం ఉండేది. ప్రతిభావంతుడైన పేసర్ ఆమీర్ ఇలానే జట్టుకు దూరమయ్యాడు. రిటైర్మెంట్ ప్రకటించి లీగ్ క్రికెట్ ఆడుకుంటున్నాడు. కాగా, ప్రపంచ కప్ ముంగిట జట్టులో లుకలుకలు బయటపడకూదనో, లేక ఎలాగైనా కప్ కొట్టాలనో పాకిస్థాన్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

ఇంజమామ్ ను చీఫ్ సెలక్టర్ గా రెండోసారి నియమించింది. 2016-19 మధ్య అతడు ఓసారి చీఫ్ సెలక్టర్ గా వ్యవహరించాడు. గత నెల వరకు హరూన్ రషీద్ పాక్ చీఫ్ సెలక్టర్ గా ఉండేవాడు. అతడు తప్పుకొన్నాక ఖాళీగా ఉంది. పాక్ టీం డైరెక్టర్ మికీ ఆర్థర్, హెడ్ కోచ్ గ్రాంట్ బ్రాడ్ బర్న్, సెక్రటరీ హసన్ చీమాలు జట్టు ఎంపికను పర్యవేక్షించనున్నారు.

గత కప్ లోనూ ఇంజమామ్ చీఫ్ సెలక్టరే 2019 ప్రపంచ కప్ లోనూ ఇంజమాముల్ హల్ పాకిస్థాన్ చీఫ్ సెలక్టర్ గా పనిచేశాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో భారత్ పై నెగ్గిన జట్టును ఎంపిక చేసినదీ ఇంజమామే. అయితే, అప్పటి ఆటగాళ్లు చాలామంది ఇప్పుడు లేరు. అంతకంటే ఎక్కువ స్థిరత్వం, ప్రతిభ ఉన్నవారు జట్టులోకి వచ్చారు.

Tags:    

Similar News