‘నో ఫ్యామిలీ’ .. బీసీసీఐ టెన్ కమాండ్ మెంట్స్ చాంపియన్స్ ట్రోఫీ నుంచే

బీసీసీఐ న్యూ రూల్స్ లో ప్రధానమైనది ఫ్యామిలీకి నో ఛాన్స్‌. అంటే విదేశీ పర్యటనల సందర్భంగా కుటుంబాలను దూరంగా ఉంచడం.

Update: 2025-02-14 07:14 GMT

స్వదేశంలో దారుణ పరాజయాలు.. విదేశాల్లోనూ కీలక మ్యాచ్ ల్లో ఓటములు.. స్టార్ ఆటగాళ్ల వైఫల్యాలు.. జట్టులో విభేదాలు.. అనూహ్య రిటైర్మెంట్లు.. ఇవీ ఇటీవలి కాలంలో టీమ్ ఇండియా గురించి చర్చల్లో నిలిచిన అంశాలు.. దీంతో నేరుగా రంగంలోకి దిగిన భారత క్రికెట్ కంట్రోలో బోర్డు (బీసీసీఐ) కఠిన ఆదేశాలు జారీచేసింది. అందరూ దేశవాళీల్లో ఆడాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు టెన్ కమాండ్ మెంట్స్ ను తీసుకొచ్చింది.

బీసీసీఐ న్యూ రూల్స్ లో ప్రధానమైనది ఫ్యామిలీకి నో ఛాన్స్‌. అంటే విదేశీ పర్యటనల సందర్భంగా కుటుంబాలను దూరంగా ఉంచడం. అయితే దీనిని ఎప్పటినుంచి చేపడతారనే దానిపై స్పష్టత రాలేదు. తాజాగా తెలిసినదాని ప్రకారం చాంపియన్స్ ట్రోఫీ నుంచే అమల్లోకి తెస్తారట. ఈ ట్రోఫీకి కూడా స్టార్ క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు బీసీసీఐ అనుమతించలేదు. ఫిబ్రవరి 19 నుంచి టోర్నీ మొదలుకానుండడం.. పైగా వ్యవధి మూడు వారాలే కావడంతో ఈ నిర్ణయం తీసుకుందట.

బీసీసీఐ పది ఆదేశాల్లో నెల రోజుల పర్యటన ఉంటే.. అందులో ఒక వారం కుటుంబాలతో ఉండేందుకు వీలుండేది. కానీ, చాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19-మార్చి 9 మధ్యన జరగుంది. దీంతో ఎవరికీ మినహాయింపు ఇవ్వొద్దని బీసీసీఐ నిర్ణయించింది. అప్పటికీ ఫ్యామిలీకి పర్మిషన్ ఇవ్వాలని ఓ సీనియర్‌ క్రికెటర్‌ కోరినా బీసీసీఐ ఒప్పుకోలేదట.

జట్టు బస చేసే హోటల్‌ లో కాకుండా సహచరులతో కలిసి రూమ్‌ షేర్‌, జట్టు ప్రయాణించే బస్సులోనే అందరూ వెళ్లాలనడం, ద్వారా సంబంధాలు మెరుగ్గా ఉంటాయని బీసీసీఐ భావిస్తోంది. వ్యక్తిగత సిబ్బందికీ ఇదే వర్తించనుంది. బోర్డు తరఫున ఆటగాళ్ల డైట్‌ కోసం ప్రత్యేకంగా చెఫ్‌ లను కేటాయించనుంది.

ఇంగ్లండ్‌ తో సిరీస్ లలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వ్యక్తిగత కార్యదర్శిని టీమ్‌ ఉన్నహోటల్‌లో ఉండేందుకు బీసీసీఐ అనుమతించలేదు. చాంపియన్స్ ట్రోఫీకీ దీనిని పాటించనున్నారు.

Tags:    

Similar News