కెప్టెన్ రోహిత్ శర్మకు ఇద్దరు భార్యలా?
ఈ సమయంలో ఆటగాడిగా, కోచ్ గా భారతదేశానికి రాహుల్ ద్రవిడ్ చేసిన సేవలకు గానూ "ది వాల్ కి భారతరత్న ఇవ్వాలి" అని సునీల్ గవాస్కర్ డిమాండ్ చేశారు
2024 టీ20 ప్రపంచకప్ తో భారత ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆటగాడిగా, కోచ్ గా భారతదేశానికి రాహుల్ ద్రవిడ్ చేసిన సేవలకు గానూ "ది వాల్ కి భారతరత్న ఇవ్వాలి" అని సునీల్ గవాస్కర్ డిమాండ్ చేశారు. ఈ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు.
అవును... 2024 టీ20 ప్రపంచకప్ తో భారత్ ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవికాలం మిగిసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన సేవలను పలువురు కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ విభిన్నంగా స్పందించారు. ఇందులో భాగంగా... తన మనసులో మాటల్ని అర్ధవంతంగా వ్యక్తీకరించడానికి సరైన పదాలను వెతుకున్నట్లు తెలిపాడు.
అయితే అది ఎప్పటికి చేస్తాననేది మాత్రం తనకు ఖచ్చితంగా తెలియనందు వల్ల ప్రస్తుతం ఓ ప్రయత్నం మాత్రం చేస్తున్నట్లు తెలిపాడు. ఇందులో భాగంగా... "నా చిన్ననాటి నుంచీ కోట్లాది మందిలానే మిమ్మల్ని చూస్తున్నాను కానీ.. ఇంత సన్నిహితంగా మీతో కలిసి పని చేయడం నా అదృష్టం" అని రాహుల్ ద్రవిడ్ ను ఉద్దేశించి రోహిత్ స్పందించాడు.
ఇదే సమయంలో... "మీరు ఈ ఆటకు సంపూర్ణంగా సమర్ధులు.. కానీ మీరు మీ విజయాలు, ప్రశంసలన్నింటినీ తలుపు వద్ద వదిలి మా కోచ్ గా నడిచారు. మేము మీతో ఏదైనా చెప్పగలిగేటంత స్థాయికి మీరు వచ్చారు. ఇది మీరు మాకు ఇచ్చిన బహుమతి, అది మీ వినయం, ఇంతకాలం తర్వాత కూడా ఆటపట్ల మీకున్న ప్రేమకు అది నిదర్శనం" అని తెలిపాడు.
ఇదే క్రమంలో... "నేను కూడా మీ నుంచి చాలా నేర్చుకున్నాను. మీతో నాకున్న ప్రతీ జ్ఞాపకం ఎంతో విలువైనదిగా ఉంటుంది. నా భార్య మిమ్మల్ని "నా వర్క్ వైఫ్" అని ఎప్పుడూ అంటుంది.. అలా పిలవడం నా అదృష్టం. రాహుల్ భాయ్ మిమ్మల్ని నా నమ్మకస్తుడు, నా కోచ్, నా స్నేహితుడు అని పిలవడం ఓ సంపూర్ణమైన అదృష్టం" అని రోహిత్ శర్మ కొనియాడారు!
కేకేఆర్ మెంటార్ గా ద్రవిడ్?:
టీం ఇండియా ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడం.. మరోపక్క కోచ్ గా గంభీర్ పేరు ఖరారైన నేపథ్యంలో... ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మెంటార్ గా వ్యవహరిస్తున్న గంభీర్ పోస్టు ఖాళీ అవుతోంది! ఈ నేపథ్యంలో... కోల్ కతా మెంటార్ గా ఉండాలని రాహుల్ ద్రావిడ్ ను ఫ్రాంఛైజీ సంప్రదించినట్లు తెలుస్తోంది.