చాంపియన్స్ ట్రోఫీ సెమీస్.. భారత్ ప్రత్యర్థి ఎవరు? మళ్లీ అఫ్ఘానిస్థాన్ తో ఫైట్?
చాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశ ముగింపునకు వచ్చింది. భారత్, న్యూజిలాండ్ అర్హత సాధించడంతో గ్రూప్ ఎ సంగతి సరే.. గ్రూప్ బి లోనే సెమీస్ నుంచి చేరేది ఎవరో మాత్రం సందిగ్ధం నెలకొంది.;
చాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశ ముగింపునకు వచ్చింది. భారత్, న్యూజిలాండ్ అర్హత సాధించడంతో గ్రూప్ ఎ సంగతి సరే.. గ్రూప్ బి లోనే సెమీస్ నుంచి చేరేది ఎవరో మాత్రం సందిగ్ధం నెలకొంది. ఇక గ్రూప్-ఎలో టాపర్ ఎవరు అనేది ఆదివారం భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ ద్వారా తేలనుంది. ఎవరు గెలిస్తే వారే టేబుల్ టాపర్ ఉంటారు. గ్రూప్ బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టును ఎదుర్కొంటారు.
టేబుల్ టాపర్ గా నిలిస్తే ఒక బెనిఫిట్ ఉంటుంది. అవతలి గరూప్ లో రెండోస్థానంలో కాస్త బలహీనమైన జట్టుతో సెమీఫైనల్స్ ఆడాల్సి ఉంటుంది. ఇలా చూస్తే గ్రూప్ బిలో ఆస్ట్రేలియా సెమీస్ చేరింది. మరి ఆ రెండో జట్టు ఏది?
రన్ రేట్ ప్రకారం దక్షిణాఫ్రికా సెమీస్ బెర్తుకు చేరువగా ఉంది. అఫ్గానిస్థాన్ కూ చాన్సుంది. అయితే, శనివారం చివరి లీగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఇంగ్లండ్ తో ఆడనుంది.
ఆస్ట్రేలియా 4 పాయింట్లతో సెమీస్ కు వచ్చేసింది. దక్షిణాఫ్రికా (3 పాయింట్లు, +2.140) గనుక ఇంగ్లండ్ పై గెలిస్తే నేరుగా సెమీస్ చుతుంది. టేబుల్ టాపర్ గా నిలుస్తుంది. ఒకవేళ ఓడినా.. అఫ్గానిస్థాన్ (3 పాయింట్లు, - 0.990) కంటే రన్ రేట్ పరంగా సఫారీ జట్టుదే పైచేయి. కాకపోతే టేబుల్ లో రెండోస్థానంలో ఉంటుంది.
చివరి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ గెలిస్తే రన్‌రేట్ కీలకం కానుంది. అఫ్గాన్ కంటే దక్షిణాఫ్రికా రన్ రేట్ తక్కువగా ఉండాలంటే.. తొలుత ఇంగ్లండ్ బ్యాటింగ్ చేసి 300+ స్కోరు కొట్టి.. దక్షిణాఫ్రికాను 207 పరుగుల తేడాతో ఓడించాలి. చేజింగ్ లో అయితే ఇంగ్లండ్ 300+ టార్గెట్ ను 11.1 ఓవర్లలోనే ఛేదించాలి.
న్యూజిలాండ్, భారత్ మధ్య ఆఖరి మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారిదే గ్రూప్-ఎలో తొలి స్థానం. అది భారత్ అనుకుందాం. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా 1, 2 స్థానాల్లో నిలిస్తే.. దక్షిణాఫ్రికాతో మన జట్టు సెమీస్ ఆడాల్సి ఉంటుంది. భారత్ గనుక న్యూజిలాండ్ చేతిలో ఓడి గ్రూప్–ఎలో రెండో స్థానంలో నిలిస్తే.. ఆస్ట్రేలియాను సెమీస్ లో ఎదుర్కొనాల్సి ఉంటుంది.
ఒకవేళ కివీస్‌పై భారత్ గెలిచి.. ఇంగ్లండ్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడితే సెమీస్ లో సఫారీ జట్టుతో టీమ్ ఇండియా ఆడుతుంది. న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా రెండో సెమీస్ లో తలపడతాయి. కివీస్ చేతిలో భారత్ ఓడి.. ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా గెలిచినా సెమీస్ లోనూ ఇదే పోరు కొనసాగుతుంది. దక్షిణాఫ్రికా సెమీస్ చేరకుంటే ఆ స్థానంలో అఫ్గాన్ వస్తుంది. టీమ్ ఇండియా టాప్ లో ఉంటే అఫ్గాన్ తోనే సెమీస్ ఆడాల్సి ఉంటుంది.
ఎందుకైనా మంచిది.. సెమీస్ లో ఆస్ట్రేలియా ఎదురవకుండా ఉండాలంటే న్యూజిలాండ్ పై చివరి లీగ్ మ్యాచ్ నెగ్గాలి. కానీ, ఫైనల్లో అయినా ఆస్ట్రేలియా ఎదురవకుండా ఉంటుందనే గ్యారెంటీ లేదు కదా? అదే జరిగితే వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవచ్చు.