43 ఏళ్లు.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వాల్సిన వయసులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
కానీ, మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం 43 ఏళ్ల వయసులో మళ్లీ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. అంతేకాదు.. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా కూడా నిలిచాడు.;

43 ఏళ్లు.. సహజంగా క్రికెట్ లో ఈ వయసు వారు రిటైర్ అయి దాదాపు ఏడెనిమిదేళ్లు అయి ఉంటుంది. అంటే.. 35 ఏళ్లు దాటితే క్రికెటర్లలో శక్తి సన్నగిల్లుతుంటుంది. ఆపై ఫామ్, కంటి చూపు తగ్గుతాయి. దీంతో రన్స్ కొట్టలేక వెటరన్స్ గా మారిపోతుంటారు
43 ఏళ్లు.. సహజంగా ఈ వయసుకు క్రికెటర్లు మాజీలు అయిపోయి కామెంట్రీ బాక్స్ లలో కనిపిస్తుంటారు. లేదా టీవీల ముందు షోలు, కామెంట్రీలు చేసుకుంటూ ఉంటారు.
43 ఏళ్లు.. ఈ వయసుకు వచ్చేసరికి కొందరు మాజీ క్రికెటర్లు రిటైర్ అయిపోయి మ్యాచ్ అఫీషియల్స్ (అంపైర్లు, రిఫరీలు) అవుతుంటారు. ఇక రవిశాస్త్రి వంటి వాగ్దాటి ఉన్న మరికొందరు పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ లలో పాల్గొంటూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లు ఇస్తుంటారు.
కానీ, మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం 43 ఏళ్ల వయసులో మళ్లీ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. అంతేకాదు.. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా కూడా నిలిచాడు. సోమవారం చెన్నై సూపర్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ధోనీలోని పాత ఫినిషర్ బయటకు వచ్చాడు.
11 బంతుల్లో 26 పరుగులు చేసిన ధఓనీ.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ క్రమంలో 2014 నాటి లీగ్ రికార్డును తిరగరాశాడు.
ఇప్పుడు ధోనీ వయసు 43 ఏళ్ల 280 రోజులు. తాజాగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలవడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో ఈ అవార్డు గెలుచుకున్న అతిపెద్ద వయస్కుడు అయ్యాడు. గతంలో 2014లో ప్రవీణ్ తాంబే రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పొందారు. అప్పటికి అతడి వయసు 42 సంవత్సరాల 208 రోజులు. దీనిని ధోనీని ఇప్పుడు తిరగరాశాడు.