ది ఫినిషర్... దినేష్ కార్తీక్ అరుదైన ఘనత!

అవును... ది ఫినిషర్ గా పేరు సంపాదించుకున్న దినేష్ కార్తీక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

Update: 2024-04-22 05:56 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేష్ కార్తీక్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. రానున్న టీ20 ప్రపంచ కప్‌ లో భారత్‌ కు ప్రాతినిధ్యం వహించాలనే కలతో ఉన్న కార్తీక్... ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ సీజన్‌ లో తనదైన బ్యాటింగ్‌ తో ఆర్సీబీ కోసం కీలకమైన పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

అవును... ది ఫినిషర్ గా పేరు సంపాదించుకున్న దినేష్ కార్తీక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇందులో భాగంగా... ఐపీఎల్ చరిత్రలో టోర్నీలో 250 మ్యాచ్‌ లు ఆడిన మూడో ఆటగాడిగా అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అతని కంటే ముందు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ మాత్రమే ఈ ఘనత సాధించారు. ఆ ఇద్దరు కూడా ఈ సీజన్ లోనే ఆ ఘనత సాధించగా.. దినేష్ కూడా ఈ సీజన్ లోనే ఆ లిస్ట్ లో చేరాడు.

2008లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ తో తన ఐపీఎల్ కెరీర్‌ ను ప్రారంభించిన డీకే... ఆ తర్వాత కింగ్స్ లెవెన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్, కోల్‌ కతా నైట్ రైడర్స్‌ లో జట్లలోనూ ఆడాడు. ఈ క్రమంలో మొత్తం 250 మ్యాచ్ లలోనూ 4767 పరుగులు సాధించాడు. వీటిలో 22 హాఫ్ సెంచరీలు ఉండగా... 97 నాటౌట్ టాప్ స్కో ర్ కావడం గమనార్హం.

ఐపీఎల్ లో అత్యధిక మ్యాచ్‌ లు ఆడిన ఆటగాళ్లు:

ఎంఎస్ ధోని: 256

రోహిత్ శర్మ: 250

దినేష్ కార్తీక్: 250

విరాట్ కోహ్లీ: 245

రవీంద్ర జడేజా: 232

Tags:    

Similar News