గుజరాత్ వర్సెస్ సన్ రైజర్స్... మార్చాల్సినవి, కొనసాగించాల్సినవి ఇవే!
దీంతో... గుజరాత్ పై నా గెలిచి ఆ జోరు కంటిన్యూ చేయాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో... ఈ రెండు జట్ల మధ్య విజయవాకాశాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం!
ఐపీఎల్ 2024లో 12వ మ్యాచ్ ఆదివారం గుజరాత్ టైటన్స్ – సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. ఈ పోరుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది. ఈ సీజన్ లోని ఫస్ట్ మ్యాచ్ లో ముంబై మీద 6 పరుగులతో విజయాం సాధించి బోణీ కొట్టిన గుజరాత్ టైటాన్స్... సెకండ్ మ్యాచ్ లో చెన్నై చేతిలో చిత్తైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏకంగా 63 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. దీంతో... రన్ రేట్ మైనస్ 1.4 కి పడిపోయింది!
మరోపక్క ఈ సీజన్ లోని తొలి మ్యాచ్ లో కోల్ కతా చేతిలో 4 పరుగుల తేడాతో ఓటమి పాలైన సన్ రైజర్స్.. ముంబై తో జరిగిన మ్యాచ్ లో రికార్డులు సృష్టించించి. ఫలితంగా 31 పరుగుల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్స్ టాపులు లేపేశారు.. ఐపీఎల్ లో అత్యధిక స్కోరు నమోదు చేశారు. దీంతో... గుజరాత్ పై నా గెలిచి ఆ జోరు కంటిన్యూ చేయాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో... ఈ రెండు జట్ల మధ్య విజయవాకాశాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం!
చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ అనంతరం... గుజరాత్ టైటాన్స్ టీంలో మార్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయనే చర్చ తెరపైకి వచ్చింది. ప్రధానంగా గాయపడిన మహ్మద్ షమీకి సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం ఆ జట్టుకున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి. మరోపక్క ఆ స్థానాన్ని ఉమేష్ యాదవ్ భర్తీ చేయలేకపోతుండటం. మరోపక్క స్పూర్థిదాయకమైన టీం ఇండియా ఆల్ రౌండర్ లేకపోవడం అనేది వారి బ్యాటింగ్ ప్రదర్శనపై ప్రభావం బాగానే చూపిస్తుందని భావించాలి.
ప్రధానంగా చెన్నైతో జరిగిన మ్యాచ్ లో సుదర్శన్, మిల్లర్ మినహా మిగిలినవారెవరూ ఆకట్టుకోలేకపోవడం ఆ జట్టుకు తీవ్ర ఆందోళనకరమైన విషయమనే చెప్పాలి. శుభ్ మన్ గిల్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా వంటి బ్యాటింగ్ లైనప్ లో వీరంతా రాణించాల్సిన మ్యాచ్ ఇది. పొరపాటున ముంబై పై చేసిన విధ్వంసం సన్ రైజర్స్ బ్యాటర్స్ మరోసారి చేస్తే... వీరికి బ్యాట్ నిండా పనిపడుతుందని మరిచిపోకూడదు!
ఇక గత మ్యాచ్ లో హోరెత్తించేసిన సన్ రైజర్స్ టీం లో ట్రావిస్ హెడ్, అభిషే శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఎయిడెన్ మార్క్రమ్ సూపర్ ఫాం లో ఉండగా... వీరికి తోడు మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్ కూడా రాణిస్తే... కథ వేరేలా ఉంటుంది. ఇదే సమయంలో బౌలింగ్ విభాగంలో కమిన్స్ తో పాటు జయదేవ్ కూడా ఇప్పటివరకూ చేసినట్లు బౌలింగ్ చేసే చాలు. ఇక భువీ స్పెల్ ని డెత్ ఓవర్స్ వరకూ ఉంచకపోతే మేలు!
హెడ్ టు హెడ్:
ఈ రెండు జట్లూ ఐపీఎల్ లో ఇప్పటివరకూ మూడు సార్లు మాత్రమే పోటీ పడగా... అందులో రెండు సార్లు గుజరాత్ నెగ్గగా, ఒకసారి హైదరాబాద్ గెలిచింది. గతం ఎలా ఉన్నప్పటికీ... వర్తమానం మాత్రం సన్ రైజర్ గా ఉండటంతో.. ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోందనేది వేచి చూడాలి.