BGT : ఆసీస్ ఆలౌట్‌, 4 రన్స్‌ లీడ్‌తో ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ షురూ

ఒక వైపు వికెట్లు పడుతున్నా ఈ టెస్టుతో అరంగేట్రం చేసిన వెబ్‌స్టర్‌ 57 పరుగులు చేసి జట్టుకు గౌరవ ప్రధమైన స్కోర్‌ను కట్టబెట్టాడు.

Update: 2025-01-04 05:02 GMT

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్‌ 5వ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇండియన్‌ బ్యాట్స్‌మెన్‌లు విఫలం అయినా బౌలర్లు మాత్రం సత్తా చాటారు. ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 185 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. మొదటి రోజే బ్యాటింగ్‌ మొదలు పెట్టిన ఆస్ట్రేలియా 9/1తో ముగించింది. రెండో రోజు ఆటలో ఆసీస్‌పై ఇండియన్ బౌలర్ల ఆధిపత్యం కొనసాగింది. ఒక వైపు వికెట్లు పడుతున్నా ఈ టెస్టుతో అరంగేట్రం చేసిన వెబ్‌స్టర్‌ 57 పరుగులు చేసి జట్టుకు గౌరవ ప్రధమైన స్కోర్‌ను కట్టబెట్టాడు.

ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 181 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. భారత బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ 3, సిరాజ్‌ 3, నితీశ్ 2, బుమ్రా 2 వికెట్లు తీసుకున్నారు. మ్యాచ్ మధ్యలో బూమ్రాకి తీవ్ర గాయం కావడంతో మైదానం వదిలాడు. అంతే కాకుండా ఆసుపత్రికి స్కానింగ్‌ కోసం వెళ్లాడు. బూమ్రా లేకపోవడంతో కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆస్ట్రేలియాను తక్కువ రన్స్‌కు కట్టడి చేయడం ద్వారా 4 పరుగుల లీడ్‌ లభించింది. ఈ అవకాశంను సద్వినియోగం చేసుకునేందుకు భారత్‌ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌ను మొదలు పెట్టింది.

ఈ మ్యాచ్‌లో భారత స్టార్‌ ఫేసర్‌ బుమ్రా అరుదైన రికార్డ్‌ను తన సొంతం చేసుకున్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 46 ఏళ్లుగా 5 టెస్టుల సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డ్‌ను బిషన్ సింగ్ బేడీ పేరిట ఉంది. ఇప్పుడు ఆ రికార్డ్‌ను బుమ్రా సొంతం చేసుకున్నారు. ఒక వైపు టెస్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ మరో వైపు ఈ రికార్డ్‌ను బుమ్రా సొంతం చేసుకున్నారు. తన కెప్టెన్సీలో తానుకు ఈ రికార్డ్‌ దక్కడం అనేది ఎప్పటికీ మరచిపోలేని విషయంగా ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

5వ టెస్టులో హిట్‌ మ్యాన్ రోహిత్‌ శర్మ లేకపోవడంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆట తీరు విషయంలో అసంతృప్తి ఉంది. ఆయన పక్కన కూర్చున్నారు అంటూ ప్రచారం చేస్తున్నా మేనేజ్మెంట్‌ ఆయన్ను పక్కన కూర్చోబెట్టిందని అనే సమాచారం అందుతోంది. దాంతో ఆయన రిటైర్మెంట్‌ కి వేళ అయ్యిందని అంతా భావిస్తున్నారు. కానీ రోహిత్‌ శర్మ మాత్రం తాను ఇప్పట్లో రిటైర్‌ అవ్వను అంటూ మ్యాచ్ మద్యలో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. ఆయన తిరిగి ఫామ్‌లోకి వస్తాను అనే నమ్మకంతో ఉన్నారు.

Tags:    

Similar News