తొలిసారి సెంచరీ సాధించిన భారత్!

Update: 2023-10-07 05:04 GMT

గతంతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నూట ముప్ఫై కోట్ల మంది ప్రజలున్న దేశంలో క్రీడలకు దక్కు ప్రాధాన్యం.. అంతర్జాతీయ వేదికల మీద భారత్ క్రీడాకుల ప్రదర్శన పేలవంగా ఉండటం తెలిసిందే. ఏదైనా అంతర్జాతీయ టోర్నీ జరిగితే.. భారత్ క్రీడాకారులు వెళ్లి రావటమే తప్పించి.. పతకాల పట్టికలో మాత్రం ఎలాంటి ప్రభావాన్ని చూపించలేని పరిస్థితి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు.. ఆగ్రహవేశాలు వ్యక్తమైనా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాని దుస్థితి.

ఇటీవల కాలంలో మార్పు మొదలైంది. దానికి నిదర్శనంగా తాజాగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో తొలిసారి భారత అథ్లెట్లు వందకు పైగా పతకాల్ని సాధించారు. ఇప్పటివరకు ఉన్న అత్యధిక పతకాల సాధన 2018 ఆసియా క్రీడల్లో 70 మెడళ్లను సాధించిన వైనమే ఉంది. తాజాగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో శుక్రవారం రాత్రి వరకు భారత క్రీడాకారులు 95 పతకాలు సాధించారు. దీంతో.. పతకాల సాధన పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.

మొత్తం 95 పతకాల్లో 25 స్వర్ణాలు.. 35 రజతాలు.. 40కాంస్య పతకాలు రావటం తెలిసిందే. శుక్రవారం రాత్రికి 95 పధకాలు.... శనివారం ఉదయం తో కలిపి 100 పథకాలు దాటేసారు. మరికొన్ని పోటీల్లో ఇంకొన్ని పతకాలు రావటం ఖాయమని చెబుతున్నారు. దీంతో. . ఆసియా క్రీడల్లో మన క్రీడాకారులు సాధించే పతకాల సంఖ్య వందను దాటేసి.. తొలిసారి మూడెంకల స్కోరును సాధించింది చెప్పాలి.

Tags:    

Similar News