అనంతపురంలో దుమ్మురేపిన టీమిండియా క్రికెటర్.. ఇక రీ ఎంట్రీనే
అయితే, అతడికి అతడికి మన ఏపీలోని అనంతపురం అతడికి పునర్జన్మ ఇచ్చింది.
వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అతికొద్ది మంది క్రికెటర్లలో ఒకరు.. ఎడమచేతివాటంతో దూకుడైన ఆటతీరు.. టి20ల్లోనూ దుమ్మురేపేంత విధ్వంసం.. కాస్త నిలకడ తోడైతే టెస్టుల్లోనూ చోటు పక్కా.. కానీ, ‘ఒక్కటి తగ్గింది పుష్ప’ అన్నట్లు అసహనం అతడికి చేటుచేసింది. చివరకు జాతీయ జట్టుకు దూరం చేసింది. సెంట్రల్ కాంట్రాక్టునూ కోల్పోయేలా చేసింది. అయితే, అతడికి అతడికి మన ఏపీలోని అనంతపురం అతడికి పునర్జన్మ ఇచ్చింది.
ఏడాదిపైగా విరామం తర్వాత
సరిగ్గా నిరుడు ఇదే రోజుల్లో టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ వన్డే ప్రపంచ కప్ సభ్యుడు. మరో ఓపెనర్ శుబ్ మన్ గిల్ కు జ్వరం ఆతడి పాలిట వరంగా మారింది. అంతకుముందు శ్రాలంకపై వన్డేల్లో డబుల్ సెంచరీ చేయడం కూడా కలిసొచ్చింది. ప్రతిభావంతుడు కావడంతో ప్రపంచ కప్ లో దుమ్మురేపుతాడని అభిమానులు ఆశించారు. కానీ, రెండు మ్యాచ్ లు ఆడినా విఫలం అయ్యాడు. దీంతో గిల్ ఇంకా పూర్తిగా కోలుకోకముందే కిషన్ ను తప్పించి ఆడించారు. ఇక తర్వాత దక్షిణాఫ్రికా టూర్ కు కూడా వెళ్లినా.. కిషన్ ను బెంచ్ లో కూర్చోబెట్టారు. దీంతో అతడు అలిగాడు. మానసిక సమస్యలంటూ జట్టు నుంచి తప్పుకొన్నాడు.
దుబాయ్ లో పార్టీలో కనిపించి
మానసిక సమస్యలంటూ జట్టు నుంచి వైదొలగిన కిషన్.. ఆ తర్వాత దుబాయ్ లో నైట్ పార్టీలో కనిపించాడు. దీనిపై విమర్శలు వచ్చాయి. మరోవైపు బీసీసీఐ రంజీ ట్రోఫీ ఆడాలంటూ కిషన్ ను కోరింది. కానీ, దానిని అతడు లెక్క చేయలేదు. నేరుగా ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్ కు వెళ్లిపోయాడు. దీంతో చిర్రెత్తిన బీసీసీఐ కిషన్ సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేసింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ లో కిషన్ పెద్దగా రాణించలేదు. చివరకు తెగేదాక లాగడం ఎందకు అనుకున్నాడేమో..? భారత దేశవాళీ సీజన్ తొలి టోర్నీ అయిన దులీప్ ట్రోఫీలో బరిలో దిగాడు. ఈ టోర్నీ ఏపీలోని అనంతపురంలో జరుగుతోంది. ఇండియా-బితో జరుగుతోన్న ఈ మ్యాచ్ లో ఇండియా-సి 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (111) శతకంతో అదరగొట్టాడు. దీంతో మరోసారి కిషన్ పేరు వెలుగులోకి వచ్చింది. అతడు మరింత రాణిస్తే భారత జట్టులోకి రీ ఎంట్రీ ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.