టీమ్ ఇండియా తదుపరి కెప్టెన్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ..
టీమ్ ఇండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఆడుతున్న తీరు చూస్తుంటే.. ఆస్ట్రేలియా అంతా ఒకవైపు.. అతడు ఒకవైపు అన్నట్లుగా ఉంది.
రోహిత్ శర్మ రిటైర్మెంట్ బాటలో ఉన్నాడు.. విరాట్ కోహ్లి మరొక ఏడాదో రెండేళ్లో ఆడతాడు.. ఇంకో మూడేళ్లు సూర్యకుమార్ యాదవ్ టి20 సారథ్యం చూస్తాడేమో..? తదుపరి టీమ్ ఇండియా కెప్టెన్ ఎవరు? వీటికి సమాధానంగా వినిపిస్తున్న పేరు ఒక్కటే.
ఆస్ట్రేలియా ఒకవైపు.. అతడు ఒకవైపు
టీమ్ ఇండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఆడుతున్న తీరు చూస్తుంటే.. ఆస్ట్రేలియా అంతా ఒకవైపు.. అతడు ఒకవైపు అన్నట్లుగా ఉంది. ఇంతకూ ఆ ‘అతడు’ ఎవరంటే.. స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. నాలుగు టెస్టుల్లో 30 వికెట్లు.. ఈ గణాంకాలు చాలు ప్రస్తుత బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో బుమ్రా ప్రదర్శన ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు. ఈ సిరీస్ లో బుమ్రా గనుక రాణించకపోతే భారత్ పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉండేదనడంలో సందేహం లేదు.
కెప్టెన్ గా బెస్ట్ చాయిస్
బోర్డర్-గావస్కర్ సిరీస్ లో బుమ్రా తొలి టెస్టుకు బుమ్రానే కెప్టెన్. ఈ సిరీస్ లో భారత్ గెలిచింది కూడా ఈ మ్యాచ్ లోనే కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో బుమ్రానే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఇక రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చిన రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అటు బ్యాటర్ గా, ఇ కెప్టెన్ గా తీవ్రంగా విఫలం అవుతుండడంతో అందరూ బుమ్రా వైపే చూస్తున్నారు.
మరో మూడేళ్లు
బుమ్రా ప్రస్తుత వయసు 31 ఏళ్లు. కోహ్లి కూడా ఎలాగూ రిటైర్ అయ్యే దశలో ఉన్నాడు. దీంతో టెస్టు కెప్టెన్సీకి తదుపరి చాయిస్ గా బుమ్రానే కావడం ఖాయం. మరోవైపు రోహిత్ వన్డేల నుంచి కూడా తప్పుకొంటే బుమ్రాను వన్డేలకూ కెప్టెన్ చేసే అవకాశం లేకపోలేదు. పనిభారం రీత్యా బుమ్రాను టి20లకూ కెప్టెన్ చేస్తారా? లేదా? అనేది చూడాలి. అయితే, ఆ ఫార్మాట్ లోనూ బుమ్రా కీలక సిరీస్ లకు అందుబాటులో ఉంటున్నాడు. టి20 ప్రపంచకప్ లో అతడే మ్యాన్ ఆఫ్ ద టోర్నీ అనే సంగతి గుర్తుండే ఉంటుంది. ఒకవేళ సూర్య కుమార్, హార్దిక్ పాండ్యా ఇద్దరినీ కాదనుకుంటే బుమ్రాకే టి20 పగ్గాలూ దక్కే చాన్సుంది.