కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్స్... హైదరాబాద్ ఆశలన్నీ వారిపైనే!
రెండుసార్లు ఛాంపియన్ అయిన కోల్ కతా నైట్ రైడర్స్ తో 2016 విజేత సన్ రైజర్స్ హైదరాబాద్ తో కలిసి 2024 సీజన్ లో రంగప్రవేశం చేయబోతుంది.
రెండుసార్లు ఛాంపియన్ అయిన కోల్ కతా నైట్ రైడర్స్ తో 2016 విజేత సన్ రైజర్స్ హైదరాబాద్ తో కలిసి 2024 సీజన్ లో రంగప్రవేశం చేయబోతుంది. ఈ మ్యాచ్ లో టాప్ టాప్ విదేశీ ఆటగాళ్లు, పైగా ఇటీవల వరల్డ్ కప్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపించిన ఆటగాళ్లు ఉండటంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతోంది. ఈ రసవత్తర పోరుకు ఈడెన్ గార్డెన్ వేదిక కాబోతుంది. ఈ సమయంలో ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం...!
2023 సీజన్ లో ఏడో ప్లేస్ లో సాధించిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో.. 10వ స్థానానికి పరిమితమైన సన్ రైజర్స్ ఆడుతున్న మ్యాచ్ ఇది. అలా అని ఈసారి హైదరాబాద్ ని ఏమాత్రం లైట్ తీసుకోలేని పరిస్థితి. ఈసారి హైదరబాద్ జట్టు అత్యంత బలమైన జట్టుగా కనిపిస్తుందనే కామెంట్లను సొంతం చేసుకుంది. కొత్త కెప్టెన్ వచ్చాడు.. జట్టు మారింది.. జెర్సీ కూడా మారింది.. ఫలితాలు కూడా మారతాయంటూ ముందుకు కదులుతుంది!
ఈ క్రమంలో శనివారం రాత్రి జరిగే తన తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు శుభారాంభం చేయాలని కోరుకుంటున్నారు తెలుగు జనాలు! ఈ సారి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కమిన్స్ ను రూ.20.5 కోట్లకు దక్కించుకుని అతడికి సారాధ్య బాధ్యతలు అప్పగించిన హైదరాబాద్. దీంతో... వరల్డ్ కప్ రిజల్ట్ దక్కొచ్చని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.
ఇదే సమయంలో... ట్రావిస్ హెడ్, మార్కో జాన్సన్, మార్ క్రమ్, క్లాసెన్ హెన్ రిచ్, హసరంగ లాంటి విదేశీ ఆటగాళ్లతో పాటు.. భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్ లాంటి కీలక దేశీయ ఆటగాళ్లు కూడా ఉండటంతో ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు శుభారంభమే చేస్తుందని భావిస్తున్నారు.
మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు బలంగా కనిపిస్తుంది. ఇందులో భాగంగా... సుమారు పాతిక కోట్ల రికార్డ్ ధరతో కోల్ కతా సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పెర్ఫార్మెన్స్ హైదరాబాదీలకు ఆందోళన కలిగిస్తుందన్నా అతిశయోక్తి లేదు. అతడి పెర్ఫార్మెన్స్ అలా ఉంటుంటుంది మరి! ఇతడితో పాటు గత సీజన్ కు దూరమైన శ్రేయస్ అయ్యర్ తిరిగి కోల్ కతా పగ్గాలు చేపట్టాడు.
వీరితో పాటు గుర్బాజ్, ఫిల్ సాల్ట్, రసెల్, నరైన్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్ లపై కోల్ కతా ఎన్నో ఆశలు పెట్టుకుంది.