.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

తొలి రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన కోహ్లీ!

అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ల నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించి.. అంతటి ఆనందంలో గుండెల్లో మంట పుట్టించాడు.

Update: 2024-06-30 04:59 GMT

ఏళ్లకు ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రావటమే కాదు.. ప్రపంచకప్ మరోసారి సొంతం చేసుకోవాలన్న వంద కోట్లకు పైగా భారతీయుల కల నెరవేరింది. టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్న టీమిండియా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. అనూహ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటన చేశారు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ల నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించి.. అంతటి ఆనందంలో గుండెల్లో మంట పుట్టించాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఏడు పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించిన టీమిండియా 2024 టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో పెద్దగా రాణించని విరాట్ కోహ్లీ కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో చెలరేగిపోయారు. అతడు సాధించిన స్కోరే.. టీమిండియా విజయానికి కీలకమైంది. 59 బంతుల్లో 76 పరుగులు సాధించారు. ఇందులో రెండు సిక్సులు (12), ఆరు ఫోర్లు (24) పరుగులు ఉన్నాయి. అంటే.. అతను ఆడిన 59 బంతుల్లో 76 పరుగులు సాధిస్తే.. ఆ స్కోర్ లో కేవలం ఎనిమిది బంతుల్లోనే 36 పరుగులు చేయటం గమనార్హం. అంటే.. అతను సాధించిన 76 పరుగుల్లో సగానికి పైగా పరుగులు అతను ఎదుర్కొన్న మొత్తం బంతుల్లో 13 శాతం మాత్రమే. అవకాశం లభించిన ఏ బంతిని అతను వదిలిపెట్టలేదు.

మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన కోహ్లీ.. తన అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ‘‘ఇది నా చివరి టీ20 ప్రపంచ కప్. మేం సాధించాలనుకున్నది ఇదే. భారత్ తరఫున ఇదే నా చివరి టీ20. నేనీ ప్రపంచ కప్ గెలవాలని కోరుకున్నా. ఇది ఓపెన్ సీక్రెట్. ఒకవేళ వరల్డ్ కప్ సాధించకున్నారిటైర్మెంట్ ప్రకటించేవాడిని. తర్వాతి తరానికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతోనే నేను వెనక్కి తగ్గుతున్నా’’ అంటూ తన అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించారు.

Read more!

ఐసీసీ టోర్నమెంట్ ను సొంతం చేసుకోవటానికి తాము చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న విషయాన్ని గుర్తు చేసిన కోహ్లీ.. తాను ఆరు ప్రపంచకప్ టోర్నీలను ఆడితే.. రోహిత్ శర్మ తొమ్మిది టీ 20 ప్రపంచకప్ లు ఆడిన విషయాన్ని ప్రస్తావించారు. ఎమోషన్లను నియంత్రించుకోవటం కష్టంగా ఉందన్న కోహ్లీ.. ఇది అద్భుతమైన రోజుగా అభివర్ణించారు. కోహ్లీ విషయానికి వస్తే అతనో అరుదైన రికార్డును క్రియేట్ చేశారు.

అదేమంటే.. వన్డే ప్రపంచకప్.. టీ20 వరల్డ్ కప్ ను సాధించిన అతి కొద్ది మంది భారత క్రికెటర్లలో కోహ్లీ ఒకరుగాచెప్పాలి. 2011లో టీమిండియా వన్డే ప్రపంచ కప్ ను సాధించిన జట్టులో ఉన్న కోహ్లీ.. తాజాగా 2024లో టీ20 వరల్డ్ కప్ ను సాధించిన జట్టులోనూ సభ్యుడిగా ఉండటం తెలిసిందే. తన కెరీర్ మొత్తంలో 125 టీ20లు ఆడిన కోహ్లీ 48.69 సగటుతో మొత్తం 4188 పరుగులు చేశారు. పొట్టి ప్రపంచ కప్ సాధించిన ఆనందంతో పాటు.. అంతర్జాతీయ టీ20లలో కోహ్లీను ఇక చూడలేమన్న వేదన మిగిలిన పరిస్థితి.

Tags:    

Similar News