రేపు ఢిల్లీతో మ్యాచ్.. చెన్నై కెప్టెన్ గా ఎంఎస్ ధోని.. ఏం జరుగుతోంది?

మహేంద్ర సింగ్ ధోనీ చివరిసారిగా 2023లో చెన్నై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్‌లో అద్భుతమైన ఆటతీరుతో జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు.;

Update: 2025-04-04 15:25 GMT
రేపు ఢిల్లీతో మ్యాచ్.. చెన్నై కెప్టెన్ గా ఎంఎస్ ధోని.. ఏం జరుగుతోంది?

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా మరోసారి వస్తే అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది? ధోనీ క్రీజులోకి వస్తుంటే చాలు స్టేడియం దద్దరిల్లిపోతుంది. ప్రత్యర్థి జట్టు అభిమానులు సైతం అతడి ఆటను ఆరాధిస్తారు. అలాంటిది మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడితే.. ఆ రోజు పండగే కదా!

రేపు ఏప్రిల్‌ 5న చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో దిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ధోనీ కెప్టెన్‌గా కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనికి కారణం.. గత మ్యాచ్‌లో గాయపడిన ప్రస్తుత సారథి రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడమే.

రుతురాజ్ గాయంపై జట్టు బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ తాజాగా స్పందించారు. చెపాక్‌లో జరిగే ప్రాక్టీస్ సెషన్‌లో రుతురాజ్ ఫిట్‌నెస్‌ను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. అతడు ఆడతాడా లేదా అనేది మ్యాచ్ రోజే నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ రుతురాజ్ ఈ మ్యాచ్‌కు దూరమైతే కెప్టెన్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారని ప్రశ్నించగా.. హస్సీ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. స్టంప్స్ వెనుక చురుగ్గా కదిలే ఓ ‘యువకుడికి’ ఆ అవకాశం దక్కుతుందని ఆయన పరోక్షంగా ధోనీ గురించే చెప్పారు. రుతురాజ్‌కు ఇంకా నొప్పి ఉందని కూడా హస్సీ వెల్లడించారు. దీంతో శనివారం జరిగే మ్యాచ్‌లో రుతురాజ్ ఆడకపోతే.. ధోనీనే కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.

మహేంద్ర సింగ్ ధోనీ చివరిసారిగా 2023లో చెన్నై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్‌లో అద్భుతమైన ఆటతీరుతో జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. తద్వారా ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ సరసన చెన్నైని నిలిపాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ జట్టు పగ్గాలు చేపట్టాడు. ఇప్పుడు మళ్లీ ధోనీ కెప్టెన్‌గా వస్తే చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రేపటి మ్యాచ్‌లో ఆ అవకాశం వస్తే వారికి నిజంగా పండగే!

రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంపై కొంతకాలంగా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. అతడూ పెద్దగా కెప్టెన్ అయ్యాక రాణించడం లేదు. అలాగే టీంను గెలిపించడం లేదు. కాబట్టి ధోని కెప్టెన్‌గా మారడం స్వాగతించదగిన మార్పు కావచ్చు. అయితే, ఇంత గొప్ప కెరీర్ తర్వాత ధోని ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల కోసం తాత్కాలిక కెప్టెన్‌గా ఉండటానికి సిద్ధంగా ఉంటాడా? అన్నది ప్రశ్న.

ఏది ఏమైనప్పటికీ, ధోని నిజంగా కెప్టెన్‌గా టాస్‌కు వస్తే, ఈ దృశ్యం సోషల్ మీడియాను ఒక రకమైన ఉన్మాదానికి గురి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News