టీం ఇండియా కోచ్‌ రేసులో టాలీవుడ్‌ హీరో... బీసీసీఐ రియాక్షన్ ఇదే!

అవును... భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ గా "ది వాల్" రాహుల్‌ ద్రావిడ్ పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగియనున్న సంగతి తెలిసిందే.

Update: 2024-05-16 05:10 GMT

ప్రస్తుతం దేశంలో క్రికెట్ ఫీవర్ పీక్స్ లో నడుస్తుంది. ఒకపక్క ఐపీఎల్ సందడి, మరోపక్క టి-20 వరల్డ్ కప్ సమరానికి సమయం దగ్గరపడుతుంది.. ఇంకోపక్క టీం ఇండియా ప్రధాన కోచ్ గా మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగియనుండటంతో కొత్త కోచ్ కోసం చర్చలు, అన్వేషణలు, అప్లికేషన్ ల సందడి నెలకొంది! ఈ సమయంలో కోచ్ రేసులో టాలీవుడ్ హీరో తెరపైకి రావడం గమనార్హం.

అవును... భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ గా "ది వాల్" రాహుల్‌ ద్రావిడ్ పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. దీంతో టీంఇండియాకు హెడ్‌ కోచ్‌ గా రాహుల్‌ ద్రావిడ్ కొనసాగుతాడా..? లేదా కొత్త కోచ్‌ వస్తారా..? అనేదానిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన కోచ్‌ పదవికి బీసీసీఐ ఒక ప్రకటనను విడుదల చేసింది.

ఆ బాధ్యతలు చేపట్టడానికి అవసరమైన అర్హతలను వెల్లడిస్తూ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు ఆన్‌ లైన్‌ లో తమ వివరాలు పొందుపరచాలని తెలిపింది. ఆసక్తి ఉంటే రాహుల్ ద్రావిడ్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది! ఈ మేరకు వెబ్ సైట్ వివరాలను ఆన్ లైన్ లో అందరికీ అందుబాటులో ఉంచింది.

దీంతో చాలామంది నెటిజన్లు భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ కోసం సరదాగా దరఖాస్తు చేస్తున్నారు. వారి వారి అప్లికేషన్స్ కి సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ లను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ సంబరపడిపోతున్నారు. దీంతో ఊహించినదానికంటే చాలా ఎక్కువగా దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందని.. దీంతో బీసీసీఐకి ఇబ్బందులు తప్పడంలేదని అంటున్నారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్‌ హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కూడా టీం ఇండియా హెడ్ కోచ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ఇందులో భాగంగా... ఈ అప్లికేషన్‌ ను ఫిల్ చేయడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని, ఇదే సమయంలో చాలా సరదాగానూ అనిపించిందని చెప్పుకొచ్చారు.

అయితే... తన దరఖాస్తును బీసీసీఐ రిజక్ట్‌ చేసిందని వెల్లడించిన రాహుల్... తాను ఒకసారైనా టీం ఇండియాకు హెడ్‌ కోచ్‌ గా ఉండాలని చెప్పడం గమనార్హం!

Tags:    

Similar News