టెస్టుల్లో ఫెయిల్..వన్డేల్లో నో ప్లేస్..ఐసీసీ టీ20 టీమ్ కు కెప్టెన్

వీటిలో అన్నిట్లోనూ కెప్టెన్ గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మనే ఉన్నాడు. అతడి సారథ్యంలో టి20 ప్రపంచ సాధించడం ఒక్కటే సానుకూల అంశం.

Update: 2025-01-25 19:30 GMT

అతడు.. అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) 2024 సంవత్సరానికి గాను ప్రకటించిన టెస్టు జట్టు దరిదాపుల్లో కూడా లేడు.

అతడు.. వన్డే ప్రపంచ కప్ ఫైనలిస్ట్ జట్టుకు కెప్టెన్ అయినప్పటికీ ఐసీసీ ఎంపిక చేసిన 2024 వన్డే జట్టుకు ఎంపిక కాలేదు.

అతడు.. టి20 ప్రంపచ కప్ గెలిచిన కెప్టెన్ గా మాత్రం ఐసీసీ ప్రకటించిన 2024 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కడమే కాదు.. కెప్టెన్ గానూ నియమితుడయ్యాడు.

నిరుడు టీమ్ ఇండియాకు మూడు ఫార్మాట్లలో మూడు రకాల అనుభవాలు ఎదురయ్యాయి. టి20ల్లో ప్రపంచ కప్ గెలవగా.. వన్డేల్లో 27 ఏళ్ల తర్వాత శ్రీలంక చేతిలో సిరీస్ కోల్పోయింది. టెస్టుల్లో అత్యంత దారుణంగా న్యూజిలాండ్ మీద సొంతగడ్డపై 0-3తో సిరీస్ ను చేజార్చుకుంది. ఆస్ట్రేలియాపైనా సిరీస్ ఓడిపోయింది.

వీటిలో అన్నిట్లోనూ కెప్టెన్ గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మనే ఉన్నాడు. అతడి సారథ్యంలో టి20 ప్రపంచ సాధించడం ఒక్కటే సానుకూల అంశం. అందుకనే ఐసీసీ 2024 టి20 ప్రపంచ కప్ జట్టు కెప్టెన్ గా అతడిని ఎంపిక చేసింది.

ఈ మేరకు ప్రకటించిన జట్టులో భారత్‌ నుంచి మరో ముగ్గురు ఆటగాళ్లకూ చోటుదక్కింది. వారు.. స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, ఆల్‌ రౌండర్ హర్దిక్‌ పాండ్యా, ఎడమ చేతివాట పేసర్ అర్షదీప్‌ సింగ్‌. వీరంతా టి20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యులే కావడం గమనార్హం.

నిరుడు రోహిత్ 11 టి20లలో 42 సగటుతో 378 పరుగులు చేశాడు. టి20 ప్రపంచ కప్ లో టీమ్‌ ఇండియా విజేతగా నిలవడంలో రోహిత్ దే కీలక పాత్ర. మూడు హాఫ్ సెంచరీలతో పాటు సూపర్‌ 8 దశలో ఆస్ట్రేలియాపై 92 పరుగులు సూపర్ ఇన్నింగ్స్ ఇడాడు.

బుమ్రా 2024లో మొత్తం 8 మ్యాచ్‌ లలో 15 వికెట్లు తీశాడు. అర్షదీప్ 18 మ్యాచ్‌ లలో 13.50 సగటుతో 36 వికెట్లు పడగొట్టాడు. పాండ్యా 17 మ్యాచ్‌ లలో 16 వికెట్లు తీయడంతో పాటు 352 పరుగులతో టాప్ ఆల్‌ రౌండర్ గా నిలిచాడు.

2024 ఐసీసీ టి20 టీమ్ ఇదే..

రోహిత్ శర్మ (కెప్టెన్‌; భారత్‌), ట్రావిస్‌ హెడ్‌ (ఆస్ట్రేలియా), ఫిల్‌ సాల్ట్‌ (ఇంగ్లాండ్‌), బాబర్‌ అజామ్‌ (పాకిస్థాన్‌), పూరన్‌ (వికెట్‌ కీపర్‌; వెస్టిండీస్‌), సికందర్‌ రజా (జింబాబ్వే), హార్దిక్‌ పాండ్యా, బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌ (భారత్‌), రషీద్‌ ఖాన్‌ (అఫ్గానిస్థాన్‌), హసరంగ (శ్రీలంక).

Tags:    

Similar News