పంత్ స్టుపిడ్.. డ్రెస్సింగ్ రూమ్ కు రానివ్వొద్దు.. గావస్కర్ నిప్పులు

తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ఇలానే గావస్కర్ ఆగ్రహానికి గురయ్యాడు.

Update: 2024-12-28 08:13 GMT

భారత క్రికెట్ బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ కు ఆట మీద ఉన్న అవగాహన అంతా ఇంతా కాదు. అందుకే 1970ల్లో అరివీర భయంకర వెస్టిండీస్ పేస్ బౌలర్లను హెల్మెట్ లేకుండానే ఎదుర్కొన్నాడు. టెస్టు క్రికెట్ లో పదివేల పరుగులు సాధించిన తొలి బ్యాట్స్ మన్ గానూ చరిత్రలో నిలిచాడు. అలాంటి గావస్కర్ ఆట మీద చేసే విశ్లేషణ అత్యంత కచ్చితంగా ఉంటుంది. స్పిన్నర్ నో బాల్ వేస్తే సన్నీ అసలు సహించడు.. బ్యాట్స్ మన్ పరుగు తీసే సందర్భంలో బ్యాట్ ను క్రీజులో ఆనించకపోతే గావస్కర్ అసలు సహించడు. ముంబై గల్లీ క్రికెటర్లతో పోల్చుతూ తీవ్రంగా అవమానిస్తుంటాడు.

ఇక పరిస్థితులకు తగ్గట్లుగా ఎవరైనా ఆడకుంటే గావస్కర్ లోని విమర్శకుడు నిద్ర లేస్తాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ఇలానే గావస్కర్ ఆగ్రహానికి గురయ్యాడు. పంత్ ను ఏకంగా స్టుపిడ్ అనే అర్థంలో నిందించాడు.

ఇంతకూ ఏం జరిగిందంటే..

ప్రధాన బ్యాట్స్ మన్ నలుగురు, నైట్ వాచ్ మన్ వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియాను కనీసం ఫాలో ఆన్ నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత పంత్ పై ఉంది. అప్పటికే అతడు 28 పరుగులతో కుదురుకున్నాడు. ఇలాంటి సమయంలో పంత్ టి20 స్టయిల్ షాట్లు ఆడబోయి ఐటయ్యాడు. బోలాండ్‌ బౌలింగ్‌ లో ర్యాంప్‌ షాట్‌ కొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.

గావస్కర్ కు చిక్కాడు..

పంత్ ఔటైన తీరు గావస్కర్ లో తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో స్టుపిడ్‌ షాట్.. స్టుపిడ్ షాట్ అంటూ మండిడ్డాడు. ‘‘పంత్.. భారత డ్రెస్సింగ్‌ రూమ్‌ లోకి వెళ్లొద్దు. ఇతర డ్రెస్సింగ్‌ రూమ్‌ కు వెళ్లాలి. భారత ఇన్నింగ్స్‌ లో అనవసర షాట్లు, రన్నింగ్‌ పొరపాట్లున్నాయి. క్లిష్ట సమయాల్లో చెత్త షాట్లు ఆడడం ఎందుకు?’’ అంటూ నిప్పులు చెరిగాడు.

అది ధర్మాగ్రహమే..

పంత్ పై గావస్కర్ ఆగ్రహంలో ఏమాత్రం తప్పులేదు. దీనికిముందు కూడా అతడు ఇలాంటి షాట్లను ఆడేందుకు చూసినా.. అప్పుడు ఫీల్డర్లు థర్డ్‌ మ్యాన్‌ దిశగా లేరు. పంత్ బ్యాటింగ్ తీరు చూశాక.. అక్కడ ఫీల్డర్లను పెట్టారు. దీనిని గమనించి ఆచితూచి ఆడాలి. టెస్టు క్రికెట్ ఆడుతూ టి20 షాట్లు కొట్టడం అత్యంత దారుణం. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో.. అందులోనూ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ఇలా ఇడడం సరికాదు.

Tags:    

Similar News