10కి 7 టెస్టుల్లో ఫెయిల్.. టీమ్ ఇండియా నెక్ట్స్ ఏమిటి?

టెస్టు మ్యాచ్ లు మరో ఆరు నెలల వరకు లేవు.. ఇంతలోనే సీనియర్ స్పిన్నర్ అశ్విన్ రిటైర్ అయిపోయాడు.

Update: 2025-01-07 00:30 GMT

గత నాలుగైదు నెలల్లో టీమ్ ఇండియా మొత్తం 10 టెస్టు మ్యాచ్ లు ఆడింది. వీటిలో ఐదు సొంతగడ్డపై.. మిగతావి ఆస్ట్రేలియాలో బోర్డర్ గావస్కర్ (బీజీటీ) సిరీస్ లో భాగంగా.. మరి వీటిలో గెలిచినవి మూడు మాత్రమే. రెండు బలహీన బంగ్లాదేశ్ పై భారత్ లో, మరొకటి ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు. మరీ ఘోరం ఏమంటే.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్ లో ఆడుతూ న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయింది. ఈ లెక్కన మన జట్టు నిఖార్సుగా గెలిచిన టెస్టు ఒక్కటే. ఇది కూడా ఆస్ట్రేలియా పూర్తి స్థాయిలో పుంజుకోక ముందే నవంబరు 22న జరిగిన మ్యాచ్. అప్పటికి ఆస్ట్రేలియా టెస్టు ఆడి ఆరు ఏడు నెలలు దాటిపోవడంతో వారికి సమాయత్తం కావడానికి సమయం పట్టింది. గులాబీ బంతితో జరిగిన ఆడిలైడ్ టెస్టు నుంచి ఏం జరిగిందో అందరూ చూశారు.

ఇప్పుడు ఏం చేద్దాం..?

టెస్టు మ్యాచ్ లు మరో ఆరు నెలల వరకు లేవు.. ఇంతలోనే సీనియర్ స్పిన్నర్ అశ్విన్ రిటైర్ అయిపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చే జూన్ లో ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమ్ ఇండియా ఇంగ్లండ్ వెళ్లనుంది. అప్పటికి రోహిత్ తో పాటు స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లిని ఎంపిక చేస్తారా? అంటే చెప్పలేం. ముందుగా రోహిత్ కు అయితే స్థానం లేదనే అనుకోవాలి. ఇంగ్లండ్ తో సిరీస్ లో కోహ్లి సంగతి కూడా తేలిపోతుంది.

వచ్చేసింది టి20 ధమాకా ఆస్ట్రేలియా చేతిలో 1-3తో ఓటమి, అంతకుముందు న్యూజిలాండ్ చేతిలో 0-3తో పరాజయం.. గత నాలుగు నెలల్లో పది టెస్టులు ఆడిన టీమ్ ఇండియా ఇప్పుడు వన్డేలు, టి20 ధమాకాలోకి దిగనుంది. ఇందులో భాగంగా టి20లు, వన్డేల్లో అత్యంత దూకుడుగా ఆడే ఇంగ్లండ్ తో తలపడనుంది. ఈ నెల 22 నుంచి ఐదు టి20ల సిరీస్ మొదలుకానుంది. ఆపై మూడు వన్డేల సిరీస్ ఉంది.

ఇది ముగిశాక ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. భారత్ మాత్రం ఆ దేశంలో పర్యటించదు. టీమ్ ఇండియా మ్యాచ్ లు దుబాయ్ లో జరుగుతాయి. ఇది ముగిశాక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదలుకానుంది.

Tags:    

Similar News