అదరగొట్టేందుకు సిద్ధం... ఐపీఎల్ టీంస్ స్క్వాడ్‌ లు ఇవే!

ఇలా సాగిన వేలం ముగిసిన అనంతరం ఏ జట్టులో ఎవరున్నారనేది ఇప్పుడు చూద్దాం...!

Update: 2023-12-20 04:11 GMT

దుబాయ్‌ వేదికగా ఐపీఎల్- 2024 సీజన్‌ కోసం ఆటగాళ్ల వేలం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సుమారు 333 మంది వేలంలో నిలిచారు. వీరిలో ప్రధానంగా ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌ ఆల్ టైం రికార్డు స్థాయిలో రూ.24.75 కోట్ల ధర పలికగా.. అతడిని కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ దక్కించుకుంది. ఇదే సమయంలో... ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్‌ ని సరికొత్త రికార్డ్ స్థాయిలో రూ.20.50 కోట్లు వెచ్చించి సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతం చేసుకుంది.

ఈ సమయంలో చాలా మంది ప్లేయర్స్ అంచనాలకంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోగా... మరికొంతమంది ప్లేయర్స్ ని మాత్రం చవకగానే పలు ప్రాం ఛైజీలు సొంతం చేసుకున్నాయి. ఇలా సాగిన వేలం ముగిసిన అనంతరం ఏ జట్టులో ఎవరున్నారనేది ఇప్పుడు చూద్దాం...!

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్:

2012లో స్థాపించబడిన ఈ ప్రాంఛైజీ ఐపీఎల్ లో 2016లో ఒకసారి ఛాంపియన్ గా నిలిచింది. ప్రస్తుతం ఆ టీం కు ఐడెన్ మార్కరం కెప్టెన్ గా ఉన్నాడు. ఇక మిగిలిన టీం సభ్యులు ఇలా ఉన్నారు.

కమిన్స్, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమద్‌, మయాంక్ అగర్వాల్, గ్లెన్ ఫిలిప్స్‌, హెన్రిచ్ క్లాసెన్, ఉపేంద్ర సింగ్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, నితీశ్‌ కుమార్ రెడ్డి, అన్మోల్‌ ప్రీత్‌ సింగ్, అభిషేక్‌ శర్మ, మార్కో జాన్సన్, షాబాజ్‌ అహ్మద్‌, సన్వీర్‌ సింగ్, భువనేశ్వర్‌ కుమార్‌, టి.నటరాజన్, మయాంక్ మార్కండే, ఫజల్‌ హక్‌ ఫారూఖీ, ఉమ్రాన్ మాలిక్, జయ్‌దేవ్‌ ఉనద్కత్‌, వనిందు హసరంగ, ఆకాశ్‌ సింగ్‌, సుబ్రమణ్యన్.

చెన్నై సూపర్‌ కింగ్స్‌:

2008లో స్థాపించబడిన ఈ ప్రాంఛైజీ ఐపీఎల్ లో హాట్ ఫేవరెట్ గా ఉంటుంటుంది. ఐపీఎల్ లో ఇప్పటివరకూ రెండు సార్లు 2010 పోటీలలో ముంబై ఇండియన్స్ జట్టును ఓడించి.. 2011 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై గెలిచి ఛాంపియన్ గా నిలిచింది. ఈ టీంకి ఎం ఎస్ ధోనీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇక మిగిలిన టీం సభ్యులు ఇలా ఉన్నారు.

డారిల్ మిచెల్, రచిన్‌ రవీంద్ర, అజింక్య రహానె, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్‌, సమీర్ రిజ్వి, రుతురాజ్‌ గైక్వాడ్, డేవాన్ కాన్వే, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌, అవనీష్ రావు అరవెల్లి, షేక్ రషీద్, మిచెల్ శాంట్నర్, మొయిన్‌ అలీ, శివం దూబే, నిశాంత్ సింధు, అజయ్ మధ్వల్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, రాజ్యవర్ధన్ హంగార్గేకర్, ముకేశ్‌ చౌదరి, సిమర్‌ జిత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, మతీశా పతిరన, తుషార్‌ దేశ్‌ పాండే.

ముంబయి ఇండియన్స్‌:

2008 లో స్థాపించబడిన ఈ జట్టు ఐపీఎల్ హాట్ ఫేవరెట్స్ లో ఒకటి. గతంలో రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్న ఈ జట్టు 5 సార్లు (2013, 2015, 2017, 2019, 2020) ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. ఈసారి ఆ జట్టుకు హార్థిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. ఇక మిగిలిన టీం సభ్యులు ఇలా ఉన్నారు.

రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అర్జున్ తెందూల్కర్, విష్ణు వినోద్, జస్‌ ప్రీత్ బుమ్రా, పీయూష్‌ చావ్లా, టిం డేవిడ్, డేవాల్డ్ బ్రెవిస్, రొమారియో షెఫర్డ్, షాంస్ ములానీ, నేహాల్ వధేరా, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ, బెరెన్‌ డార్ఫ్‌, గెరాల్డ్‌ కోయెట్జీ, దిల్షాన్‌ మదుశంక, శ్రేయస్‌ గోపాల్‌, అన్షుల్ కంబోజ్, నమన్ దిర్‌, మహమ్మద్ నబీ, శివాలిక్‌ శర్మ, నువాన్‌ తుషారా.

ఢిల్లీ క్యాపిటల్స్‌:

2008 ఢిల్లీ డేర్ డెవిల్స్ గా మొదలైన ఈ జట్టు పేరును 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ గా మార్చారు. ఐపీఎల్ లో ఇప్పటివరకూ ఫైనల్స్‌ లోకి ఎప్పుడూ వెళ్ళని ఏకైక జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది! ఈ జట్టుకు ప్రస్తుతం డెవిడ్ వార్నర్ కెప్టెన్ గా ఉండగా... మిగిలిన టీం సభ్యులు ఇలా ఉన్నారు.

రిషభ్‌ పంత్, పృథ్వీ షా, అభిషేక్ పొరెల్, అక్షర్ పటేల్, కుల్‌ దీప్‌ యాదవ్, యశ్‌ ధూల్, లలిత్ యాదవ్, ప్రవీణ్‌ దూబె, ఇషాంత్ శర్మ, విక్కీ ఓస్త్వాల్‌, అన్రిచ్‌ నోర్జే, మిచెల్ మార్ష్‌, లుంగి ఎంగిడి, ముకేశ్‌ కుమార్‌, ఖలీల్ అహ్మద్, కుమార్ కుశాగ్ర, హ్యారీ బ్రూక్, సాత్విక్‌ చికార, జాయ్‌ రిచర్డ్ సన్, షై హోప్‌, ట్రిస్టన్ స్టబ్స్‌, రిషిక్‌ దార్‌, సుమిత్ కుమార్!

లక్నో సూపర్ జెయింట్స్:

2022 లో ప్రారంభమై ఐపీఎల్ లోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉండగా... మిగిలిన టీం సభ్యులు ఇలా ఉన్నారు.

క్వింటన్ డికాక్, దేవ్‌ దత్ పడిక్కల్, ఆయుష్‌ బదౌని, దీపక్‌ హుడా, నికోలస్ పూరన్, కృష్ణప్ప గౌతం, కైల్ మేయర్స్‌, కృనాల్ పాండ్య, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టాయినిస్, యుధ్‌ విర్‌ సింగ్, మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్‌, మార్క్‌ వుడ్, రవిబిష్ణోయ్, యశ్ ఠాకూర్‌, అమిత్ మిశ్రా, నవీనుల్ హక్‌, శివం మావి, ఎం సిద్ధార్థ్, మహ్మద్‌ అర్షద్‌ ఖాన్‌, డేవిడ్‌ విల్లే, అర్షిన్‌ కులకర్ణి, అస్టన్‌ టర్నర్.

పంజాబ్‌ కింగ్స్‌:

2008లో ప్రారంభమైన ఈ జట్టు తొలుత కింగ్స్ లెవెన్ పంజాబ్ గా ఉండగా.. 2021లో పంజాబ్ కింగ్స్ గా పేరు మార్చారు. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే... 2014 లో రన్నరప్ గా నిలవడం తప్ప మిగతా 12 సీజన్లలో ఈ జట్టుకు ప్లే ఆఫ్స్ కు చేరుకోలేదు. శిఖర్ దావన్ కెప్టెన్ గా ఉన్న ఈ జట్టులో మిగిలిన ఆటగాళ్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం...!

జితేశ్ శర్మ, లివింగ్ స్టోన్, జానీ బెయిర్‌ స్టో, ప్రభ్‌ సిమ్రన్‌ సింగ్, అథర్వ తైడే, రిషి ధావన్, సాం కరణ్‌, సికిందర్‌ రజా, హర్‌ ప్రీత్‌ భాటియా, శివం సింగ్, అర్ష్‌ దీప్ సింగ్, రబాడ, హర్‌ ప్రీత్ బ్రార్‌, నాథన్ ఎలిస్‌, విద్వత్ కావేరప్ప, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్‌, రిలీ రొసోవ్, క్రిస్ వోక్స్‌, విశ్వనాథ్‌ ప్రతాప్ సింగ్, అషుతోష్ శర్మ, శశాంక్‌ సింగ్, టోనీ త్యాగరాజన్‌, ప్రిన్స్‌ చౌధరి.

రాజస్థాన్‌ రాయల్స్‌:

2008 లో స్థాపించబడిన ఈ జట్టు తొలి ఐపీఎల్ సీజన్ ఛాంపియన్ గా చరిత్ర సృష్టించింది. షేన్ వార్న్ కెప్టెన్సీలో ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్‌ ను గెలుచుకుంది. అనంతరం రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో 2013 ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ 20 లో రెండవ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం సంజు శాంసన్ కెప్టెన్ గా ఉన్న ఈ టీంలో మిగిలిన సభ్యులు ఇలా ఉన్నారు.

జోస్ బట్లర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆడం జంపా, యశస్వి జైస్వాల్, ధ్రువ్‌ జురెల్, హెట్‌ మయర్‌, రియాన్ పరాగ్, కునాల్ రాథోడ్, డొనొవాన్‌ పెరీరా, కుల్‌ దీప్‌ సేన్, నవదీప్‌ సైని, ప్రసిద్ధ్‌ కృష్ణ, అబిద్ ముస్తాక్, సందీప్‌ శర్మ, యుజువేంద్ర చాహల్, అవేశ్‌ ఖాన్‌, శుభం దూబె, నాండ్రీ బర్గర్‌, టాం కోహ్లెర్‌ కాడ్‌ మోర్‌, రోవ్‌ మన్ పావెల్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

2008లో ప్రారంభమైన ఈ జట్టు ఇప్పటి దాకా ఏ ఐపీఎల్ ఫైనల్ నూ గెలుచుకోలేదు కానీ.. 2009, 2011, 2016 సంవత్సరాల మధ్యలో మాత్రం మూడు సార్లు రన్నరప్ గా నిలిచింది. ఈ సీజన్ లో డుప్లెసిస్ కెప్టెన్ గా ఉన్న ఈ జట్టులో కీలక ఆటగాళ్లే ఉన్నారు. వారి వివరాలు ఇప్పుడు చూద్దాం..!

విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌ వెల్, దినేశ్ కార్తిక్, రజత్ పాటిదార్, మహ్మద్ సిరాజ్, అనుజ్ రావత్, సుయాశ్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్‌, కామెరూన్‌ గ్రీన్‌, మహిపాల్ లామ్రోర్, కర్ణ్‌ శర్మ, మనోజ్ భాంగే, మయాంక్ దగార్, వైశాఖ్‌ విజయ్ కుమార్‌, ఆకాశ్‌ దీప్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, టాం కరన్, సౌరభ్ చౌహాన్‌, రాజన్ కుమార్, అల్జారీ జోసెఫ్‌, స్వప్నిల్ సింగ్.

గుజరాత్ టైటాన్స్‌:

2021లో స్థాపించబడి ఐపీఎల్ లో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టుకు టీం ఇండియా ఓపెనర్ శుభమన్ గిల్ కెప్టెన్ గా ఉన్నారు. మిగిలిన ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, కేన్‌ విలియమ్సన్, అభినవ్‌ మనోహర్, వృద్ధిమాన్‌ సాహా, మహ్మద్ షమి, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, రాహుల్ తెవాతియా, నూర్ అహ్మద్‌, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రషీద్‌ ఖాన్‌, ఉమేశ్ యాదవ్, రాబిన్‌ మిజ్, జోష్‌ లిటిల్, సాయి కిషోర్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్‌, షారూక్‌ ఖాన్‌, సుషాంత్ మిశ్రా, కార్తిక్ త్యాగి, మనవ్ సుతార్, అజ్మతుల్లా ఒమర్జాయ్‌.

కోల్‌ కతా నైట్‌ రైడర్స్:

2008లో స్థాపించబడిన ఈ జట్టు 2012లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓడించి.. 2014లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టును ఓడించి విజేతగా నిలిచింది. ఇలా రెండు సార్లు ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుంది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా ఉన్న ఈ జట్టు సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.

మిచెల్ స్టార్క్‌, రింకు సింగ్, ఆండ్రె రసెల్, మనీశ్ పాండే, నితీశ్ రాణా, రహ్మనుల్లా గుర్భాజ్‌, అనుకుల్ రాయ్‌, జేసన్ రాయ్‌, వెంకటేశ్‌ అయ్యర్, హర్షిత్ రాణా, సుయాశ్ శర్మ, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోడా, ముజీబుర్ రెహ్మన్‌, రూథర్ ఫోర్డ్, అటిస్కన్, కేఎస్ భరత్, చేతన్ సకారియా, అగస్త్య రఘువన్షి, షకిబ్ హుస్సేన్‌, రమణ్‌ దీప్‌ సింగ్.

వేలంలో అమ్ముడుపోని గుర్తింపు పొందిన ఆటగాళ్లు:

టెస్టుల్లో దిగ్గజంగా, వన్డేల్లోనూ మంచి బ్యాటర్‌ గా గుర్తింపు ఉన్న ఆ్రస్టేలియా స్టార్‌ క్రికెటర్ స్టీవ్‌ స్మిత్‌ ను టీ20లకు తగడని ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు భావిస్తున్నట్లున్నాయి.. ఈ క్రమంలో గత ఏడాదిలాగే ఈసారి కూడా కనీస విలువ రూ.2 కోట్లకు కూడా ఎవరూ తీసుకోకపోవడం గమనార్హం. ఇదే సమయంలో ఈ ప్రపంచకప్ విన్నింగ్‌ టీంలో ఉన్న ఆసీస్‌ బౌలర్‌ హాజల్‌ వుడ్‌ నూ ఎవరు ఎంచుకోలేదు.

ఇదే సమయంలో... జేసన్‌ హోల్డర్‌ (వెస్టిండీస్‌), జిమ్మీ నీషం (న్యూజిలాండ్‌), టిం సౌతీ (న్యూజిలాండ్‌), క్రిస్‌ జోర్డాన్‌ (ఇంగ్లండ్‌), స్యాం బిల్లింగ్స్‌ (ఆ్రస్టేలియా), మిల్నే (న్యూజిలాండ్‌), తబ్రీజ్‌ షమ్సీ (దక్షిణాఫ్రికా), హనుమ విహారి, సర్ఫరాజ్‌ ఖాన్‌ (భారత్‌) లపై కూడా ప్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు.

Tags:    

Similar News