అనామక జట్టు నుంచి 2003 టాప్ వికెట్ టేకర్!

తొలుత టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో.. ఆ తర్వాత వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియాను పరాజయం వెక్కిరించింది.

Update: 2023-12-21 23:30 GMT

మరొక్క పదిరోజులే .. 2023 ముగుస్తోంది.. ఈ ఏడాది భారత క్రికెట్ అభిమానులకు రెండు తీరని బాధలను మిగిల్చిది. తొలుత టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో.. ఆ తర్వాత వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియాను పరాజయం వెక్కిరించింది. అది కూడా జట్టంతా మంచి ఫామ్ లో ఉండగా ఓడిపోవడం వ్యథగా మారింది. సరే.. ఆటలో ఇవన్నీ సహజం అనుకుని ముందుకుసాగాలి. వచ్చే వేసవిలో టి20 ప్రపంచ కప్ ఉంది. 2007 తర్వాత మన జట్టు ఈ ఫార్మాట్ లో మళ్లీ విశ్వ విజేత కాలేదు. అందుకే ఆ కప్ అయినా సాధించాలని కోరుకోవాలి. మొత్తానికి 2023లో ఆస్ట్రేలియా ప్రపంచ చాంపియన్ గా ఆవిర్భవించింది.

టాప్ వికెట్ టేకర్స్ ఎవరంటే..

ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్ జరిగింది. రౌండ్ రాబిన్ లీగ్.. అంటే ప్రతి జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. సెమీ ఫైనల్, ఫైనల్ కలుపుకొంటే 11 మ్యాచ్ లు అన్నమాట. ఆయా జట్లకు ఉన్న మిగతా ద్వైపాక్షిక, త్రైపాక్షిక సిరీస్ లకు తోడు ప్రపంచ కప్ మ్యాచ్ లు తోడయ్యాయి. దీంతో ఎక్కువ సంఖ్యలో మ్యాచ్ లు ఆడినట్లైంది. కాగా, ఏడాది చివరకు వచ్చేసరికి అత్యధిక వికెట్లు తీసినది ఎవరో పరిశీలిస్తే.. అనామక జట్టుకు చెందిన పేసర్ కావడం ఆశ్చర్యం కలిగించింది. మొత్తమ్మీద ముగ్గురు బౌలర్లు.. అర్షదీప్ సింగ్ (భారత్), మార్క అడైర్ (ఐర్లాండ్), రిచర్డ్ ఎంగర్వ (జింబాబ్వే) తలా 26 తీసి 2023లో టాప్ వన్డే బౌలర్లుగా నిలిచారు. రవి బిష్ణోయ్ (18-భారత్), ర్యాన్ బర్ల్ (17-జింబాబ్వే), సికిందర్ రజా (17-జింబాబ్వే), అల్జారీ జోసెఫ్ (16-వెస్టిండీస్), మెకార్తీ(16-ఐర్లాండ్), తస్కిన్ అహ్మద్ (16-బంగ్లాదేశ్), ఇష్ సోథీ (15-న్యూజిలాండ్), బెన్ వైట్ (15-ఐర్లాండ్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఆశ్చర్యమే..? ఎందుకంటే?

వన్డేల్లో భారత్ నుంచి అర్షదీప్ టాప్ వికెట్ టేకర్ గా నిలవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఫ్రంట్ లైన్ బౌలర్లకు విశ్రాంతినిస్తే అర్షదీప్ నే తీసుకుంటున్నారు. ఈ లెక్కన చూస్తే అర్షదీప్ టాప్ లో నిలవడం చెప్పుకోదగ్గదే. కానీ, ఎంగర్వ టాప్ లో ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. జింబాబ్వే ఈసారి ప్రపంచ కప్ నకు అర్హత సాధించలేదు. అంటే.. కనీసం 9 మ్యాచ్ లు ఆడలేదు. అయినప్పటికీ ఎంగర్వ 26 వికెట్లు పడగొట్టడం గమనార్హం. ఐర్లాండ్ కూడా ప్రపంచ కప్ నకు అర్హత సాధించలేదు. దీన్నిబట్టి అడైర్ కూడా మంచి ప్రతిభతో వికెట్లు తీసినట్లే. కాగా, అర్షదీప్ కూడా వరల్డ్ కప్ జట్టులో లేడు. బిష్ణోయ్, బర్ల్, రజా, జోసెఫ్, మెకార్తీ కూడా ఇంత.. అంటే.. ప్రపంచ కప్ బౌలర్లే ఈ ఏడాది టాప్ వికెట్ టేకర్స్ గా నిలిచారు. ఇదీ ఓ విశేషమే.

Tags:    

Similar News