అమరన్ ఓటీటీ వచ్చేది అప్పుడే.. ఆలస్యానికి కారణం అదే..
క్రిస్మస్ లేక న్యూ ఇయర్ కానుకగా ఈ చిత్రం ఆన్లైన్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని టాక్.
ఈసారి దీపావళికి థియేటర్లలో విడుదలైన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో సందడి చేసింది. లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు తమిళ్ డబ్బింగ్ చిత్రం అమరన్ కూడా మంచి వసూలు రాబట్టింది. శివ కార్తికేయన్, సాయి పల్లవి కాంబినేషన్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులను నెలకొల్పుతో ముందుకు సాగుతోంది.
ఈ మూవీకి సంబంధించి ఆన్లైన్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అన్ని సినిమాల లాగా ఇది కూడా విడుదలైన 30 నుంచి 45 రోజుల మధ్యలో ఓటీటీ లోకి రావాల్సి ఉంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు కాస్త నిరాశ కలిగేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి ఓటీటీ లోకి ఇప్పుడప్పుడే తీసుకొచ్చేలా లేరు.
ఇప్పటికి కూడా ఈ చిత్రం థియేటర్లో మంచి ఆక్యుఫెన్సీ తో దూసుకుపోతున్నడంతో.. ఆన్లైన్ స్ట్రీమింగ్ డేట్ ని కాస్త పొడిగించడానికి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం డిసెంబర్ చివరి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.దివంగత ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ స్టోరీ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తెరకెక్కించిన అమరన్ చిత్రంలో సాయి పల్లవి అద్భుతమైన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది.
ఈ మూవీతో శివ కార్తికేయన్ కి కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం 250 కోట్ల కలెక్షన్ రికార్డును కొల్లగొట్టింది. దీంతో తమిళ్ సినీ ఇండస్ట్రీలో రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ తర్వాత 200 కోట్ల కలెక్షన్స్ రికార్డ్ దాటిన హీరోగా శివ కార్తికేయన్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ చిత్రం ఓటీటీ ఆలస్యం కావడం మూవీ లవర్స్ కు కాస్త నిరాశ కలిగిస్తుంది. క్రిస్మస్ లేక న్యూ ఇయర్ కానుకగా ఈ చిత్రం ఆన్లైన్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని టాక్.