ధనుష్ ఇంగ్లీష్ మూవీ వచ్చింది, చూశారా?
ఇంగ్లీష్, తమిళ్ వర్షన్‌లలో ఇన్నాళ్లు అందుబాటులో ఉన్న ఈ సినిమాను తాజాగా తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు ఆహా ఓటీటీ వారు తీసుకు వచ్చారు.;

ధనుష్ హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్నాడు. తమిళ సినిమాల్లోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లోనూ ధనుష్ సినిమాలు చేసిన విషయం తెల్సిందే. ధనుష్ ఇండియన్ సినిమాలకే పరిమితం కాకుండా హాలీవుడ్ సినిమాలోనూ నటించాడు. ధనుష్ ముఖ్య పాత్రలో 'ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' అనే ఇంగ్లీష్ సినిమా వచ్చింది. 2018లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. వంద కోట్లకు పైగా వసూళ్ల టార్గెట్‌తో వచ్చిన ఆ సినిమా మినిమం వసూళ్లను సొంతం చేసుకోవడంలో విఫలం అయింది. అయితే ఓటీటీలో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది.
ఇంగ్లీష్, తమిళ్ వర్షన్‌లలో ఇన్నాళ్లు అందుబాటులో ఉన్న ఈ సినిమాను తాజాగా తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు ఆహా ఓటీటీ వారు తీసుకు వచ్చారు. ఆహా ఓటీటీ లో ఈ సినిమాను ఇప్పటికే స్ట్రీమింగ్ చేశారు. ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ సినిమాలో ధనుష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. కమర్షియల్‌గా నిరాశ పరచినా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంలో ఈ సినిమా సక్సెస్ అయింది. అందుకే ధనుష్ అభిమానులతో పాటు, ప్రేక్షకులు అంతా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడం కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సినిమాను ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయడంతో ధనుష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధనుష్ ప్రస్తుతం ఉన్న జోష్ నేపథ్యంలో ఈ సినిమాకు ఓటీటీలో ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది.
ధనుష్ ఇటీవల 'నీలావుకు ఎన్ మేల్ ఎన్నడి కోబం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడిగా ఇప్పటికే మంచి పేరు సొంతం చేసుకున్న ధనుష్ ఈ సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. జాబిలమ్మ నీకు అంత కోపమా అనే టైటిల్‌తో తెలుగులో ఈ సినిమాను డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. విభిన్నమైన లవ్ స్టోరీతో ధనుష్ యూత్ ఆడియన్స్‌ను అలరించాడు. తక్కువ సమయంలోనే తమిళనాట మంచి వసూళ్లను ఈ సినిమా రాబట్టిందని తెలుస్తోంది. నటుడిగానూ ధనుష్ చాలా బిజీగా ఉన్న విషయం తెల్సిందే.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'కుబేర' సినిమాతో ధనుష్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కుబేర సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ధనుష్ కి సార్ సినిమాతో టాలీవుడ్‌లో బిగ్ హిట్ దక్కింది. ఇప్పుడు మరో తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో నటిస్తున్న కారణంగా అంచనాలు మరింత పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కుబేరా ఉంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. మరో వైపు ధనుష్ తన దర్శకత్వంలో ఇడ్లీ కడై అనే సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయి విడుదలకు సిద్ధం అవుతోంది. త్వరలోనే ఆ సినిమా విడుదల తేదీ పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.