'క' ఓటీటీ.. పైరసీ భూతానికే షాక్ ఇచ్చేలా..

క సినిమా.. థియేటర్, ఓటీటీలోనే కాదు.. మరో విజయం కూడా సాధించిందని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Update: 2024-11-28 11:07 GMT

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్ గా 'క' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. రిలీజ్ కు ముందు చెప్పినట్లు మంచి హిట్ ను సొంతం చేసుకున్నారు. కొంత కాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్న ఆయన.. సరైన కమ్ బ్యాక్ అందుకున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన చిత్రంతో అందరినీ ఓ రేంజ్ లో మెప్పించారు కిరణ్.

ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేశారు. ఈటీవీ విన్ లో కొన్ని గంటల క్రితం నుంచి క మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అందుబాటులోకి వచ్చిన నుంచి కూడా మంచి వ్యూస్ అందుకుంటోంది. సినీ ప్రియులను మరోసారి అలరిస్తోంది. థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ సూపర్ హిట్ గా నిలిచేలా కనిపిస్తోంది. పలు రికార్డులను క్రియేట్ చేసేలా హోప్స్ క్రియేట్ చేస్తోంది.

అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. క సినిమా.. థియేటర్, ఓటీటీలోనే కాదు.. మరో విజయం కూడా సాధించిందని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు పైరసీ విషయంలో క విజయం సాధించిందని చెబుతున్నారు. ఓటీటీ ఈటీవీ విన్ నిర్వాహకులను ఓ రేంజ్ లో అంతా కొనియాడుతున్నారు.

నిజానికి.. సినీ ఇండస్ట్రీకి పైరసీ పెద్ద సమస్యగా మారిపోయింది. దాని ఎఫెక్ట్ చాలా మందిపై పడుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దాన్ని ఆపడం ఎవరి తరం కావడం లేదు. దీంతో ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీ.. ఆ విషయంలో పోరాడి గెలిచిందని చెబుతున్నారు. క మూవీ.. పైరసీకి గురికాకుండా సేవ్ చేయడంలో సక్సెస్ అయిందని అంటున్నారు.

సినిమాను స్క్రీన్ క్యాప్చర్ చేసేందుకు లేదా డౌన్లోడ్ చేసేందుకు వీలు కానట్లు ఈటీవీ విన్ కొన్న స్పెషల్ ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. పైరసీకి వ్యతిరేకంగా కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. క మూవీ విషయంలోనే కాదు.. వీరాంజనేయులు విహారయాత్ర సమయంలో కూడా ఇదే విధానాన్ని ఫాలో అయిందట.

దీంతో అప్పుడు పైరసీ కాస్త ఎక్కువగానే తగ్గిందని చెప్పాలి. అయితే కంటెంట్ బాగుంటే ఏ ఓటీటీకి అయినా యూజర్స్ కచ్చితంగా పెరుగుతారు. అదే సమయంలో యాంటీ పైరసీ ఫీచర్స్ తీసుకొస్తే.. మరింత మంది వినియోగదారులు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈటీవీ విన్ తీసుకొచ్చిన ఫీచర్స్ ను మిగతా ఓటీటీలు తీసుకొస్తాయో లేదో చూడాలి.

Tags:    

Similar News