బిగ్ బాస్ 8 : హౌస్ లో మణికంఠ.. విన్నర్ గా అతన్ని చూడాలని..!
బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ వెరైటీగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారితో చేయించారు.
బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ వెరైటీగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారితో చేయించారు. సోమవారం నుంచి మొదలైన ఈ నామినేషన్ ప్రక్రియ మంగళవారం ఎపిసోడ్ వరకు కొనసాగించారు. ఈ ఎపిసోడ్ లో ఆదిత్య ఓం, నైనిక, మణికంఠ, సీత వచ్చి నామినేట్ చేశారు. వీళ్లంతా కూడా నిఖిల్, నబీల్, ప్రేరణ, యష్మిలనే నామినేట్ చేశారు.
ఆదిత్య ఓం ప్రేరణ, యష్మిలను నామినేట్ చేశాడు. నైనిక నబీల్, యష్మిలను నామినేట్ చేసింది. మణికంఠ నిఖిల్, నబీల్ లను నామినేట్ చేశాడు. చివరగా వచ్చిన సీత యష్మి, ప్రేరణని నామినేట్ చేసింది. ఫైనల్ గా ఈ వారం నామినేషన్స్ లో ప్రేరణ, యష్మి, నబీల్, పృధ్వి, నిఖిల్ ఉన్నారు.
11 వారాల తర్వాత హౌస్ నుంచి వైల్డ్ కార్డ్స్ కాకుండా పాత కంటెస్టెంట్స్ అంతా నామినేట్ అయ్యారు. వీరిలో తక్కువ ఓటింగ్ ఉన్న వారు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐతే ఈ నామినేషన్ ప్రక్రియలో మణికంఠ నిఖిల్, నబీల్ లను నామినేట్ చేస్తూ వాళ్లకు బయట ఉన్న పరిస్థితులను చెప్పడానికి హింట్ ఇచ్చాడు. నిఖిల్ ని ఫిల్టర్స్ తీసి ఆడమని చెప్పిన మణికంఠ నబీల్ కు మాత్రం ఎమోషనల్ అవ్వకు, రిలేషన్స్ పెట్టుకోకుండా ఇదివరకులా ఆడమని చెప్పాడు.
నబీల్ ని టైటిల్ విన్నర్ గా చూడాలని ఉందని మణికంఠ వెళ్తూ చెప్పాడు. అంతేకాదు బయట పరిస్థితి ఎలా ఉందో కూడా చెప్పాడు. ఇక నామినేషన్స్ తర్వాత సీత యష్మి నిఖిల్ ట్రాప్ లో పడింది అన్న మాటలకు నిఖిల్ హర్ట్ అయ్యాడు. హౌస్ మెట్స్ అంతా భోజనం చేస్తున్నా కూడా అతను చేయలేదు. పృధ్వి ఎంత చెప్పినా వినలేదు. అవినాష్, తేజాలు వచ్చి నిఖిల్ కు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు.
ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ వల్ల టాప్ 1, 2 లో ఉన్న నిఖిల్ కు బాగా ఎఫెక్ట్ పడిందని చెప్పొచ్చు. మొన్నటిదాకా నిఖిల్ టైటిల్ విన్నర్ రేసులో ఉన్నాడు. అనూహ్యంగా గౌతం రేసులోకి వచ్చాడు. ఇప్పుడు ఈ నామినేషన్స్ ప్రక్రియ చూశాక గౌతం నిఖిల్ ని వెనక్కి నెట్టి ముందుకు వెళ్లేలా ఉన్నాడని చెప్పొచ్చు. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ గా వచ్చిన వారంతా కూడా ఈ వారం సేఫ్ లో ఉండటం విశేషం.