ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే

సంక్రాంతి సినిమాల సందడి ఇంకా బాక్సాఫీస్‌ వద్ద కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది

Update: 2025-01-24 07:01 GMT

సంక్రాంతి సినిమాల సందడి ఇంకా బాక్సాఫీస్‌ వద్ద కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ వారం కూడా సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. వీకెండ్‌లోనూ సినిమా కచ్చితంగా మరోసారి సాలిడ్ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ స్థాయిలో సినిమా వసూళ్లు సాధిస్తున్న నేపథ్యంలో చిన్న సినిమాలు నాలుగు ఐదు ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నేడు థియేటర్‌ ద్వారా వచ్చిన సినిమాల్లో గాంధీ తాత చెట్టు గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. మరి బాక్సాఫీస్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ వారం ఓటీటీ ద్వారా వచ్చిన సినిమాల ఏంటి అనేది చూద్దాం.

అమెజాన్ ప్రైమ్‌ వీడియో ద్వారా 'విడుదలై పార్ట్‌ 2' స్ట్రీమింగ్‌ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా అందుబాటులో ఉంది. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. మంజు వారియర్‌ కీలక పాత్రలో నటించింది. మొదటి పార్ట్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సెకండ్‌ పార్ట్‌ పై అంచనాలు పెరిగాయి. అయితే సెకండ్‌ పార్ట్‌ అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. థియేట్రికల్‌ రిలీజ్‌లో నిరాశ పరచిన ఈ సినిమా ఓటీటీ ద్వారా హిట్ అయ్యేనా అనేది చూడాలి. తమిళ్‌తో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ అమెజాన్ ఈ సినిమాని స్ట్రీమింగ్‌ చేస్తోంది.

ఆహా ఓటీటీ ద్వారా రజాకార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేటి నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమాను ఆహా వారు గోల్డ్‌ యూజర్స్‌కి మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉంచారు. వచ్చే వారం లేదా ఆ తర్వాత వారంలో రెగ్యులర్‌ యూజర్స్‌కి అందుబాటులో ఉంచే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈటీవీ విన్‌ ద్వారా నిన్నటి నుంచి వైఫ్ ఆఫ్ స్ట్రీమింగ్‌ అవుతుంది. విభిన్నమైన కథ, కథనంతో సాగే వైఫ్ ఆఫ్‌ కి ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కుతోంది.

జీ5లో హిసాబ్ బరాబర్‌ నేటి నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాలు పెద్దగా ఏమీ లేవు. గత వారంలో స్ట్రీమింగ్‌ అయిన సినిమాలు, సిరీస్‌లతోనే ప్రేక్షకులు ఈవారం నెట్టుకు రావాల్సిందే. నెట్‌ ఫ్లిక్స్‌లో ఈ వారం ది నైట్ ఏజెంట్‌ సీజన్ 2 వెబ్‌ సిరీస్‌, ది సాండ్ క్యాసిల్‌, యూ ఫైనల్‌ సీజన్‌ వెబ్‌ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. హాట్‌ స్టార్‌లో బరోజ్ 3డి సినిమా మలయాళంలో స్ట్రీమింగ్ అవుతుంది. స్వీట్‌ డ్రీమ్స్‌ను సైతం హాట్‌ స్టార్‌ నేటి నుంచి స్ట్రీమింగ్‌ చేస్తోంది.

Tags:    

Similar News