ఈ వారం ఓటీటీ రిలీజులివే!
వారం వారం వచ్చే కొత్త సినిమాల్లానే ఈ శుక్రవారం కూడా ఎక్కువ సినిమాలే రిలీజయ్యాయి. కాకపోతే ఈ వారం అధిక సంఖ్యలో సినిమాలు డిజిటల్ లో రిలీజ్ అయ్యాయి.
బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సినిమాల హడావిడి ముగిసిపోయింది. ఇవాళ కొత్తగా నాగ చైతన్య నటించిన తండేల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో పాటూ ఓటీటీలో పలు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. వారం వారం వచ్చే కొత్త సినిమాల్లానే ఈ శుక్రవారం కూడా ఎక్కువ సినిమాలే రిలీజయ్యాయి. కాకపోతే ఈ వారం అధిక సంఖ్యలో సినిమాలు డిజిటల్ లో రిలీజ్ అయ్యాయి. మరి ఏయే సినిమాలు ఏయే డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో రిలీజయ్యాయో ఇప్పుడో లుక్కేద్దాం.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అయిన గేమ్ ఛేంజర్ సినిమాతో పాటూ ది మెహతా బాయ్స్ అనే హిందీ ఫ్యామిలీ డ్రామా, న్యూటోపియా అనే సౌత్ కొరియన్ హారర్, సర్వైవల్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు రిలీజయ్యాయి. సోనీ లివ్ లో రేఖా చిత్రం అనే తెలుగు డబ్బింగ్ మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో పాటూ బడా నామ్ కరేంగే అనే హిందీ రొమాంటిక్ వెబ్ సిరీస్ కూడా రిలీజైంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 5న అనుజా అనే హిందీ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ కాగా, హాలీవుడ్ నుంచి సెలబ్రిటీ బేర్ హంట్, ప్రిజన్ సెల్ 211 ఫిబ్రవరి 5న రిలీజయ్యాయి. ది గ్రేటెస్ట్ రైవల్రీః ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనే హిందీ డాక్యుమెంటరీ సిరీస్ ఫిబ్రవరి 7న స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఇక హాట్‌స్టార్‌లో కోబలి అనే తెలుగు వెబ్ సిరీస్ ఫిబ్రవరి 4న రిలీజవగా, జీ5లో బాలీవుడ్ నుంచి మిసెస్ ఫిబ్రవరి 7న, హాలీవుడ్ నుంచి ది ఆర్ మర్డర్స్ ఫిబ్రవరి 6న స్ట్రీమింగ్ లోకి వచ్చాయి.
ఇక మనోరమ మ్యాక్స్ ఓటీటీలో మలయాళ ఫ్యామిలీ డ్రామా స్వర్గం, మలయాళ రొమాంటిక్ లవ్ స్టోరీ ఓషానా, మలయాళ యాక్షన్ థ్రిల్లర్ వాలియెట్టన్ 4కె రిలీజయ్యాయి. ఆహా ఓటీటీలో తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ డ్రామా వివికానందన వైరల్, ఆహా తమిళ ఓటీటీలో తమిళ యాక్షన్ థ్రిల్లర్ మద్రాస్కారన్ రిలీజయ్యాయి.