తెలుగు ఇండస్ట్రీలో గత రెండు, మూడు వారాలుగా అన్ని చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. పెద్ద సినిమాలేమి రాలేదు. కేవలం శ్రీవిష్ణు 'సామజవరగమణ', ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య 'బేబీ' మాత్రం సూపర్ హిట్‌గా నిలిచాయి. శ్రీవిష్ణు సామజవరగమణ స్లోగా పికప్ అయి మంచి వసూళ్లను అందుకుంది. బేబీ అయితే సెన్సేషనల్‌గా హిట్ అయింది నిర్మాతలకు లాభాలు ఇస్తోంది. ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ రెండింటితో పాటు అశ్విన్ బాబు హిడింబ కూడా ఇప్పుడిప్పుడే కాస్త వసూళ్లను అందుకుంటోంది. అయితే ఈ వారం మాత్రం బాక్సాఫీస్ ముందు బడా హీరో చిత్రం రిలీజ్ కానుంది. అదే పవర్ స్టార్ పవన్ కల్యాణ్-మెగా యంగ్ హీరో సాయి తేజ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం 'బ్రో'. అలాగే ఓటీటీలోనూ పలు చిత్రాలు రానున్నాయి. అవేంటంటే..
ముందుగా అందరి చూపు.. పవన్‌కల్యాణ్, సాయి తేజ్ కలిసి నటించిన 'బ్రో' మీదే ఉంది. సముద్రఖని దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. అందించడం విశేషం. ఇప్పటికే విడుదల టీజర్, ట్రైలర్ బాగా ఆకట్టుకున్నాయి. జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. తమన్ సంగీతం అందించారు. కేతికశర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, బ్రహ్మానందం తదితరులు నటించారు.
సీనియర్ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్‌రావు హీరోగా నటించిన చిత్రం 'స్లమ్ డాగ్ హస్బెండ్'. బ్రహ్మాజీ, సప్తగిరి ఇతర పాత్రల్లో నటించారు. ఏ.ఆర్.శ్రీధర్ దర్శకత్వం వహించారు. మైక్ మూవీస్ నిర్మించింది. ఈ చిత్రం 29న విడుదల కానుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ - అలియా భట్ కలిసి నటించన 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' జులై 28న రానుంది. దీనికి కరణ్ జోహార్ తెరకెక్కించారు.
ఇక ఈ వారం ఓటీటీలో కూడా కొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.
నెట్‌ఫ్లిక్స్‌లో
డ్రీమ్ (కొరియన్ మూవీ) జులై 25, మామన్నన్ (తమిళ్/తెలుగు) జులై 27, పారడైజ్ (హాలీవుడ్) జులై 27, హిడెన్ స్ట్రైక్ (హాలీవుడ్) జులై 27, హ్యాపీనెస్ ఫర్ బిగినెర్స్ (హాలీవుడ్) జులై 27, హౌ టు బికమ్ ఎ కల్ట్ లీడర్ జులై 28 స్ట్రీమింగ్ అవ్వనున్నాయి.
అమెజాన్ ప్రైమ్‌లో
గ్లామర్ బ్యూటీ సునైనా 'రెజీనా'(తమిళం) జులై 25, 'డిస్నీ'లో ఆషిఖానా (హిందీ సిరీస్) జులై 24,
'సోనీలివ్'లో
ట్విస్టెడ్ మెటల్ (వెబ్‌సిరీస్) జులై 28,
'బుక్ మై షో'లో
జస్టిస్ లీగ్: వార్ వరల్డ్ (యానిమేషన్ మూవీ) జులై 23, ట్రాన్స్‌ఫార్మర్స్:రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ (హాలీవుడ్) జులై 26, ద ఫ్లాష్ (హాలీవుడ్) జులై 27..
'జియో' సినిమాలో
లయనెస్ (హాలీవుడ్) జులై 23, కాల్‌కూట్ (హిందీ) జులై 27, 'మనోరమా మ్యాక్స్'లో కొళ్ల (మలయాళం) జులై 27 రిలీజ్ కానున్నాయి. వీటన్నింటిలో తెలుగు ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువగా 'బ్రో' చిత్రంతో పాటు ఓటీటీలో రిలీజ్ కానున్న 'మామన్నన్'(తమిళం), 'ది ఫ్లాష్'(హాలీవుడ్), 'డ్రీమ్'(కొరియన్ సిరీస్) పైనే ఉన్నట్లు తెలుస్తోంది.