OTT వీకెండ్ లిస్ట్.. మీరు ఏ సినిమా చూస్తారు మరి?

కానీ ఓటీటీల్లో ఎప్పటిలాగే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు అలరిస్తున్నాయి. అయితే ఈ వీకెండ్ లో ఓటీటీల్లో ఏం చూడాలో మీరు డిసైడ్ అవ్వలేకపోతున్నారా?

Update: 2024-06-21 17:30 GMT

ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారం కూడా పెద్ద చిత్రాల సందడి లేదు. థియేటర్లలో చిన్న సినిమాలే విడుదలయ్యాయి. వరుణ్ సందేశ్ నింద, చైతన్య రావు-హెబ్బా పటేల్ హనీమూన్ ఎక్స్‌ ప్రెస్ సహా అనేక చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ఓటీటీల్లో ఎప్పటిలాగే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు అలరిస్తున్నాయి. అయితే ఈ వీకెండ్ లో ఓటీటీల్లో ఏం చూడాలో మీరు డిసైడ్ అవ్వలేకపోతున్నారా?

అందుకే ఏ ఓటీటీలో ఏ సినిమా లేదా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకోండి. అప్పుడు వీకెండ్ ను పక్కాగా ప్లాన్ చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్, జియో సినిమా వంటి కొన్ని ప్రముఖ ఓటీటీల్లో ఏ ఏ సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ అవుతున్నాయో వీకెండ్ స్పెషల్ గా మీకోసం.

బాక్, గం గం గణేశా ఎక్కడంటే?

సౌత్ హీరోయిన్లు తమన్నా, రాశీ ఖన్నా నటించిన అరణ్మనై 4 (బాక్ మూవీ) ఓటీటీలోకి వచ్చేసింది. ఇద్దరు గ్లామర్ డాల్స్ సందడి చేసిన ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. టాలీవుడ్ యంగ్ ఆనంద్ దేవరకొండ నటించిన గం గం గణేశా.. కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి (జూన్ 21వ తేదీ) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది ఆ యాక్షన్ కామెడీ మూవీ.

కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 కూడా!

Read more!

నెట్ ఫ్లిక్స్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ కోటా ఫ్యాక్టరీ సీజన్-3 ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. జియో సినిమాలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ రెండో సీజన్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. వీటితోపాటు అనేక సినిమాలు, వెబ్ సిరీసులు వీకెండ్ స్పెషల్ గా అందుబాటులోకి వచ్చాయి. అవేంటంటే?

వీకెండ్ స్పెషల్ గా నెట్ ఫ్లిక్స్ లోకి భారీగా సినిమాలు, వెబ్ సిరీసులు వచ్చాయి. గ్యాంగ్స్ ఆఫ్ గలీసియా (స్పానిష్ సిరీస్), నడిగర్ తిలగం (తెలుగు డబ్బింగ్ మూవీ), ద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 (మాండరిన్ సిరీస్), ట్రిగ్గర్ వార్నింగ్ (ఇంగ్లీష్ మూవీ), నడిగర్ (మలయాళం), ట్రిగర్ వార్నింగ్ (హాలీవుడ్) స్ట్రీమింగ్ అవుతున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ బ్యాడ్ కాప్ తోపాటు ద బేర్ సీజన్ అందుబాటులోకి వచ్చాయి. జియో సినిమాలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్-3 స్ట్రీమింగ్ అవుతోంది. ఆహాలోకి రొమాంటిక్ థ్రిల్లర్ రసవతి మూవీ వచ్చింది. మరి మీరు ఏ సినిమా / వెబ్ సిరీస్ చూస్తారు?

Tags:    

Similar News

eac